Telugu News » Baba Ramdev: ఐటీ రంగంలోకి యోగా గురు రాందేవ్‌ బాబా..!

Baba Ramdev: ఐటీ రంగంలోకి యోగా గురు రాందేవ్‌ బాబా..!

అప్పుల ఊబిలో కూరుకుపోయినా రోల్టా ఇండియా లిమిటెడ్‌కు రీ-బిడ్ చేయడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) ముంబై బెంచ్ అనుమతించింది. దీంతో రాందేవ్ బాబా ఐటీ రంగం(IT sector)లోకి అడుగుపెట్టనున్నారు.

by Mano
Baba Ramdev: Yoga guru Ramdev Baba into the IT sector..!

యోగాగురు రామ్‌దేవ్‌ బాబా(Yogaguru Ramdev Baba) ఐటీ రంగం(IT sector)లోకి అడుగుపెట్టనున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయినా రోల్టా ఇండియా లిమిటెడ్‌కు రీ-బిడ్ చేయడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) ముంబై బెంచ్ అనుమతించింది.

Baba Ramdev: Yoga guru Ramdev Baba into the IT sector..!

దీంతో రామ్‌దేవ్ బాబా పతంజలి ఆయుర్వేదకు మార్గం సుగమమైంది. రోల్టా.. డిఫెన్స్ ఫోకస్డ్ సాఫ్‌వేర్ కంపెనీ(Defense focused software company). ఇది జనవరి 2023లో దివాలా తీసింది. యూనియన్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం రూ.7,100కోట్లు, సిటీ గ్రూప్ నేతృత్వంలోని అన్‌సెక్యూర్డ్ విదేశీ బాండ్లను కలిగి ఉన్నవారు రూ.6, 699కోట్లు బకాయిపడ్డారు.

రోల్టాపై మొత్తంగా రూ.14వేల కోట్ల అప్పుల్లో ఉంది. రోల్టా ఇండియాను పతంజలి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. ఈ నేపథ్యంలో ఇద్దరు న్యాయమూర్తులు ప్రభాత్ కుమార్, వీరేంద్ర సింగ్ బిప్త్ లతో కూడిన ధర్మాసనం ఒక ఆర్డర్‌లో పతంజలితో పాటు బిడ్‌లు సమర్పించిన ఇతర దరఖాస్తుదారులందరినీ తమ బిడ్‌లను సవరించడానికి అనుమతించాలి.

ఈ బిడ్ దరఖాస్తుదారు రిజల్యూషన్ ప్లాన్ పరిగణనలోకి తీసుకునేందుకు కమిటీ ఆఫ్ క్రెడిటర్స్‌ను అనుమతిస్తుంది. రోల్టాకు పెద్ద పోటీదారులు ఉన్నారు. దివాలా ప్రక్రియ రూ.500కోట్ల నుంచి రూ.700కోట్ల మధ్య తొమ్మిది బిడ్‌లను అందుకుంది. ఇతర బిడ్డర్లలో పలు కంపెనీల షేర్లు ఉన్నాయి.

You may also like

Leave a Comment