Telugu News » KCR Birthday: అసెంబ్లీలో కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి..!

KCR Birthday: అసెంబ్లీలో కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి..!

కేసీఆర్ 70వ బర్త్ డే వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీ (Assembly) వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు.

by Mano
KCR Birthday: CM Revanth Reddy wished KCR on his birthday in the assembly..!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 70వ బర్త్ డే వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు స్వయంగా, సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీ (Assembly) వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు.

KCR Birthday: CM Revanth Reddy wished KCR on his birthday in the assembly..!

‘రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా, పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో 40 సంవత్సరాలకు పైగా పనిచేసి తనదైన పాత్ర పోషించారు. ఆయన 70వ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ రేవంత్ తెలిపారు.

అదేవిధంగా ‘భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి.. తెలంగాణ పున:నిర్మాణంలో వారిని భాగస్వామ్యం చేయాలి.. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభను సజావుగా నడిపేలా, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి నడిపించేలా ఆయనకు పూర్తి స్థాయిలో దేవుడు శక్తి, సామర్థ్యాలను ఇవ్వాలని కోరుకుంటున్నా..’ అంటూ రేవంత్ ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలను చెప్పుకొచ్చారు.

దీంతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా హర్షం వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ వేదికగా సభలో లేని ప్రతిపక్ష నాయకుడికి శుభాకాంక్షలు చెప్పడం శుభపరిణామమని అంటున్నారు. అంతకుముందు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కూడా బీఆర్ఎస్‌ అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆమె గవర్నర్‌ కార్యాలయ ప్రతినిధి ద్వారా ఒక లేఖను, పుష్పగుచ్ఛాన్ని పంపించారు.

You may also like

Leave a Comment