Telugu News » Upasana Second Pregnancy: సెకండ్ ప్రగ్నెన్సీపై హింట్ ఇచ్చిన మెగా కోడలు..!

Upasana Second Pregnancy: సెకండ్ ప్రగ్నెన్సీపై హింట్ ఇచ్చిన మెగా కోడలు..!

ఉపాసన మరోసారి మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఓ కార్యక్రమానికి హాజరైన ఉపాసన రెండో బిడ్డకు జన్మనిచ్చే ప్లాన్(Second Pregnancy)పై మాట్లాడింది.

by Mano
Upasana Second Pregnancy: Mega daughter-in-law gave a hint on second pregnancy..!

మెగాకోడలు ఉపాసన(Upasana) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓవైపు అపోలో ఆస్పత్రి బాధ్యతలతో పాటు మెగా కోడలిగా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తోంది. ఇటీవలే రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana) దంపతులకు తొలిసంతానం పాప జన్మించిన సంగతి తెలిసిందే. ఆ పాపకు క్లింకార అని నామకరణం చేశారు.

Upasana Second Pregnancy: Mega daughter-in-law gave a hint on second pregnancy..!

అయితే తాజాగా ఉపాసన మరోసారి మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఓ కార్యక్రమానికి హాజరైన ఉపాసన రెండో బిడ్డకు జన్మనిచ్చే ప్లాన్(Second Pregnancy)పై మాట్లాడింది. ఇంకా ఆ కార్యక్రమంలో మహిళల ఆరోగ్యంపై పలు సూచనలు చేసింది. మహిళలు ఆరోగ్యంపై పూర్తి దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది.

ప్రతీ ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపింది ఉపాసన. జీవితంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మహిళల నిర్ణయమని, తాను పిల్లల్ని కనడానికి ఎందుకు ఆలస్యమైందో చెప్పుకొచ్చింది. తన పక్కనున్న డాక్టర్ కూడా ఆలస్యంగానే పిల్లల్ని కావాలని అనుకుందని చూపించింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నందుకు తానేమీ బాధపడలేదని స్పష్టతనిచ్చింది.

చివరగా తన సెకండ్‌ ప్రెగ్నెన్సీ గురింటి ప్రశ్న ఎదురవ్వగా ‘మే హెల్త్.. మై ఛాయిస్..’ అని చెప్పింది ఉపాసన. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదిఏమైనప్పటికీ ఈ ఏడాది చివరిలోగా ఉపాసన మరో శుభవార్త చెబుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈసారి మెగా వారసుడు రాబోతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment