Telugu News » Lok Sabha Election : బీజేపీతో సమరం కాంగ్రెస్ కు అంత సులువా.. ఈ వ్యూహం ఫలిస్తే ప్రియాంక ప్రధాని అవుతారా..?

Lok Sabha Election : బీజేపీతో సమరం కాంగ్రెస్ కు అంత సులువా.. ఈ వ్యూహం ఫలిస్తే ప్రియాంక ప్రధాని అవుతారా..?

ఇదే సమయంలో రాహుల్ గాంధీ 2019 ఎన్నికలలో ఓటమికి బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే రెండు వరుస ఓటముల తరువాత కాంగ్రెస్ మళ్లీ జీవం పోసుకోవడానికి తీవ్రంగా శ్రమించింది.

by Venu

ప్రస్తుతం ఇండియా కూటమి (Alliance of India) పరిస్థితి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న స్థితిలో ఉందని తెలుస్తోంది. ఒక లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమి పార్టీ ఎక్కువ కాలం సాగదనే విమర్శలను నిజం చేస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి వారే యమునా తీరేలా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జీవం లేకుండా మారుతున్న ఇండియా కూటమికి ఆక్సిజన్ అందించడానికి కాంగ్రెస్ (Congress) అధిష్టానం అద్భుతమైన ప్రణాళిక రచించినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇంత కాలం రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేతృత్వంలోనే కాంగ్రెస్ ముందుకు సాగుతుందన్న విధానానికే అధిష్టానం కట్టుబడి ఉంది. అయితే కాంగ్రెస్ మిత్రపక్షాలు రాహుల్ గాంధీ రాజకీయ అపరిపక్వతను ఎత్తి చూపుతూ ఒక్కటొక్కటిగా దూరం అవుతూ వచ్చాయి. పైగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాఫ్ ఏమంత పెరగలేదు సరికదా మరింత దిగజారడంతో కాంగ్రెస్ లో నిరాశా నిస్ఫృహలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ నాయకత్వ పటిమపై సొంత పార్టీలో అనుమానాలు మొలకెత్తాయి.

ఇదే సమయంలో రాహుల్ గాంధీ 2019 ఎన్నికలలో ఓటమికి బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే రెండు వరుస ఓటముల తరువాత కాంగ్రెస్ మళ్లీ జీవం పోసుకోవడానికి తీవ్రంగా శ్రమించింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ సారథ్యంలో భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో కాంగ్రెస్ 2024 ఎన్నికలపై ఆశలు పెంచుకొంది. మరోవైపు మోడీ (Modi)ని, బీజేపీ (BJP)ని ఢీ కొనాలంటే బీజేపీయేతర పార్టీలన్నీ సమష్టిగా ఒక్కటి అవ్వాలి.. ఒకే తాటిపై ముందుకు సాగాలి..

లేకుంటే పార్టీ పుంజుకున్నా.. అధికారం చేజిక్కించుకొనే అవకాశాలు ఏ వైపు చూసిన అంతంత మాత్రమే అన్న నిజాన్ని గ్రహించిన కాంగ్రెస్ ఆ దిశగా వూహరచనలో నిమగ్నం అయ్యింది. ఈ దశలో ఏర్పడిన ఇండియా కూటమికి కాంగ్రెస్ నేతృత్వంపై పెద్దగా అభ్యంతరాలు లేకపోయినప్పటికీ రాహుల్ నేతృత్వంలో పని చేయడం విషయంలోనే భాగస్వామ్య పక్షాలలో వేరు అభిప్రాయం ఉన్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ క్రమంలో ఇండియా కూటమి చెల్లా చెదురైంది. ఒక్కొక్కరు కూటమి నుంచి దూరం అవుతున్నారు. ఇలా కూటమి చీలికలు పేలికలు కాకుండా నివారించడానికి కాంగ్రెస్ తురఫు ముక్కలాంటి వ్యూహానికి తెరలేపిందనే టాక్ వినిపిస్తోంది. రాహుల్ నేతృత్వంపై కొద్ది పాటి అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న కూటమి భాగస్వామ్య పక్షాలను మళ్లీ ఏకతాటిపైకి తీసుకురావాలంటే ప్రధాని పదవికి ప్రియాంక (Priyanka) పేరును ప్రతిపాదించడమే సరైనదని అధిష్టానం భావిస్తున్నట్లు పరిశీలకులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెరపైకి వచ్చిన ప్రియాంక పేరు ఇండియా కూటమిలో వేడిని చల్లార్చుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల ముంగిట.. మరో సారి ప్రియాంక ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్న ప్రతిపాదన గట్టిగా ముందుకు రావడంలో కాంగ్రెస్ వ్యూహం ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదన ఎంతవరకు కాంగ్రెస్ ఆశయాలను బ్రతికిస్తుందో అనే సందేహాలు కలుగుతున్నాయి. బీజేపీతో సమరం అంత సులువు కాదని.. రకరకాల ఎత్తులు వేస్తున్న కాంగ్రెస్ ఆశలు గల్లంతు అవుతాయా?.. ఫలిస్తాయా? అనే ఆసక్తి ప్రస్తుతం దేశ రాజకీయాల్లో నెలకొందని తెలుస్తోంది.

You may also like

Leave a Comment