Telugu News » MLC Kavitha : లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా కవిత.. ఏం జరగబోతోంది..?

MLC Kavitha : లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా కవిత.. ఏం జరగబోతోంది..?

ఈ మధ్య కాలంలో చాలా మంది నిందితులు అప్రూవర్లుగా మారారు. వారు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా మరిన్ని ఆధారాలతో కవితను నిందితురాలిగా చేర్చారు. ఈ సారి ఇంటికి వచ్చి విచారణ జరిపే అవకాశం లేదు. ఢిల్లీ వెళ్లి హాజరు కావాల్సి ఉంటుంది.

by admin
CBI has stepped in..Kavitha's emergency petition in the special court!

– ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
– ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేర్చిన సీబీఐ
– 41-ఏ సీఆర్పీసీ కింద నోటీసుల జారీ
– 26న ఢిల్లీలో విచారణకు రావాలని ఆదేశం
– కవిత పేరును ఛార్జిషీట్ లో చేర్చిన సీబీఐ
– విచారణకు హాజరవ్వడంపై ఉత్కంఠ
– 28న సుప్రీంలో కవిత పిటిషన్ పై విచారణ
– అది సాకుగా చూపి వెళ్లకుండా ఉంటారా?
– లేక, విచారణకు హాజరవుతారా?
– ఒకవేళ సీబీఐ ముందుకెళ్తే.. అరెస్ట్ తప్పదా..?

ఢిల్లీ లిక్కర్‌ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ నిందితురాలిగా చేర్చింది. కవితను నిందితురాలిగా పరిగణిస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో సమాచారం కోసం కవితను సీబీఐ ప్రశ్నించింది. దర్యాప్తు తర్వాత నిందితురాలిగా పేర్కొంటూ.. 41 కింద నోటీసులు ఇచ్చామని కోర్టుకు తాజాగా సీబీఐ తెలిపింది. లిక్కర్‌ కేసులో నిందితుల స్టేట్‌మెంట్స్‌ ఆధారంగా కవితకు నోటీసులు జారీ చేసినట్టు చెప్పింది. 2022 డిసెంబర్‌లో కవితను సీబీఐ ప్రశ్నించింది.

brs mlc kavita petition postphone on februrary 28 th on liquor case

గతంలో ఇదే కేసుకు సంబంధించి ఈడీ అధికారులు కవితను మూడు సార్లు ప్రశ్నించారు. నాలుగో సారి విచారణకు రావాలని సమన్లు జారీ చేసినప్పుడు హాజరు కాకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంలో వేసిన పిటీషన్ పై ఈ నెల 28న విచారణ జరగనుంది. ఇదే సమయంలో కవితకు ఇచ్చిన నోటీసును సవరించి సీబీఐ నిందితురాలిగా చేర్చడంతో కేసు కీలక మలుపు తిరిగింది. అయితే.. ఈ నోటీసులపై కవిత ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈడీ కేసులో సుప్రీం విచారణ ఉండటంతో సీబీఐ విచారణకు హాజరు కావొద్దని ఫిక్స్ అయినట్లు సమాచారం. కేసీఆర్ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గతంలో సీబీఐ అధికారులు విచారణ ముగించుకుని వెళ్తూ కవితకు మరో నోటీసు ఇచ్చారు. ధ్వంసం చేసిన ఫోన్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆ నోటీసులో ఉంది. ఇవి ఆ కేసులో సాక్ష్యాల కిందకు వస్తాయి. ఆమె వద్ద ఖచ్చితంగా ఉన్నాయని నిరూపణ చేసుకునే సీబీఐ ఈ నోటీసులు జారీ చేసింది. మళ్లీ విచారణ ఎప్పుడు అన్నది గత విచారణలో తేదీ ఇవ్వలేదు. త్వరలోనే అని సమాచారం ఇచ్చారు అధికారులు. అయితే.. ఇప్పటి వరకూ మళ్లీ విచారణకు పిలవలేదు.

ఈ మధ్య కాలంలో చాలా మంది నిందితులు అప్రూవర్లుగా మారారు. వారు ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా మరిన్ని ఆధారాలతో కవితను నిందితురాలిగా చేర్చారు. ఈ సారి ఇంటికి వచ్చి విచారణ జరిపే అవకాశం లేదు. ఢిల్లీ వెళ్లి హాజరు కావాల్సి ఉంటుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కానీ.. ఈడీ కానీ ఆషామాషీగా ఏమీ చేయడం లేదని.. ప్రణాళికాబద్దంగానే చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముందు ముందు కవితకు ఈ కేసులో చిక్కులు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

డే వన్ నుంచి జరిగింది ఇదే..!

– 2020 సెప్టెంబ‌ర్ నుంచి మే 2021 వ‌ర‌కు ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ కొత్త విధానం త‌యారు చేశారు.
– 2021 న‌వంబ‌ర్ 8న లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా లిక్క‌ర్ పాల‌సీ విధానంపై మొద‌టిసారిగా ఆరోప‌ణ‌లు చేశారు.
– 2022 జులై 20న కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ భ‌ల్లాకు లిక్కర్ పాలసీపై లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ లేఖ రాశారు.
– జులై 22న సీబీఐకి లేఖ రాశారు ఎల్జీ.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేయాల‌ని కోరారు.
– ఆగస్ట్ 17న సీబీఐ ఎఫ్‌ఐఆర్ న‌మోదు చేసింది. 15 మంది పేర్లను నిందితులుగా చేర్చింది. ఈడీ ఒక్కరోజు వ్య‌వధిలోనే కేసును టేక్ ఓవ‌ర్ చేసుకుంది.
– సెప్టెంబ‌ర్ 5, 6, 7 తేదీల్లో హైద‌రాబాద్ లోని 6 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిగాయి.
– సెప్టెంబ‌ర్ 17, 18 తేదీల్లో ఎమ్మెల్సీ క‌విత ఆడిట‌ర్ గోరంట్ల బుచ్చిబాబు ఆఫీస్ లో సోదాలు చేశారు అధికారులు.
– సెప్టెంబ‌ర్ 21న అర‌బిందో ఫార్మా అధినేత శ‌ర‌త్ చంద్రారెడ్డిని విచారించింది ఈడీ.
– అక్టోబ‌ర్ 7, 8 తేదీల్లో హైద‌రాబాద్ మీడియా సంస్థ‌ల్లో సోదాలు జరిగాయి.
– అక్టోబ‌ర్ 10న బోయిన‌ప‌ల్లి అభిషేక్ రావును సీబీఐ అరెస్ట్ చేసింది.
– అక్టోబ‌ర్ 12న ఆంధ్ర‌ప్ర‌భ ఎండీ ముత్తా గౌత‌మ్ అరెస్ట్ అయ్యారు.
– అక్టోబ‌ర్ 17న ఢిల్లీ డిప్యూటీ సీఏం సిసోడియాను ప్ర‌శ్నించింది సీబీఐ.
– న‌వంబ‌ర్ 10న శ‌ర‌త్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసింది ఈడీ.
– న‌వంబ‌ర్ 14న అప్ కి చెందిన విజ‌య్ నాయ‌ర్, అభిషేక్ బోయినప‌ల్లిని సీబీఐ కేసులో బెయిల్ రాగానే ఈడీ అరెస్ట్  చేసింది.
– న‌వంబ‌ర్ 16న దినేష్ అరోరా అప్రూవ‌ర్ గా మారడానికి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమ‌తి.
– న‌వంబ‌ర్ 25న 10 వేల పేజీల‌తో సీబీఐ తొలి చార్జీషీట్.
– న‌వంబ‌ర్ 26న ఈడీ మొద‌టి చార్జీషీట్ దాఖ‌లు.
– న‌వంబ‌ర్ 29న అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసింది. అదేరోజు కవిత పేరును రిమాండ్ రిపోర్టులో 25 సార్లు ప్ర‌స్తావించింది. 10 సెల్ ఫోన్స్ వాడార‌ని ధ్వంసం చేశార‌ని కోర్టుకు నివేదించింది.
– డిసెంబ‌ర్ 6న క‌విత‌కు సీబీఐ నోటీసులు.
– డిసెంబ‌ర్ 11న క‌విత‌ను విచారించింది సీబీఐ. సీఆర్పీసీ 191 కింద నోటీసుల జారీ.
– 2023 జ‌న‌వరి 6న ఈడీ రెండో చార్జీషీట్ దాఖ‌లు చేసింది. ఇందులో సీఎం కేజ్రీవాల్.. స‌మీర్ మ‌హేంద్రతో మాట్లాడిన‌ట్లు ఆధారాలతో స‌హా ప్ర‌స్తావించింది.
– నెల రోజులు 118 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన డేటాను ఎన‌లైజ్ చేసుకున్నాక ఈ విషయాన్ని బయటపెట్టింది.
– ఫిబ్ర‌వ‌రి 8న క‌విత మాజీ ఆడిట‌ర్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది.
– ఫిబ్ర‌వ‌రి 18న సిసోడియాకు సీబీఐ నోటీసులు
– ఫిబ్ర‌వ‌రి 25న స‌మీర్ మ‌హేంద్ర‌, విజ‌య్ నాయ‌ర్, దినేష్ అరోరా, అమిత్ అరోరా, అరుణ్ రామచంద్ర‌ పిళ్లై ఆస్తుల‌ను జప్తు చేసింది ఈడీ.
– ఫిబ్ర‌వ‌రి 26న 8 గంట‌ల పాటు మ‌నీష్ సిసోడియాను విచారించి సాయంత్రం అరెస్ట్ చేసింది సీబీఐ.
– మార్చి 7న అరుణ్ రామ‌చంద్ర ఫిళ్లైని ఈడీ అరెస్ట్ చేసింది. 7 రోజుల క‌స్ట‌డీ విధించింది కోర్టు. రిమాండ్ రిపోర్ట్ లో పిళ్లై.. క‌విత బినామీయే అని పేర్కొంది ఈడీ.
– మార్చి 8న క‌విత‌కు ఈడీ నోటీస్ పంపంది. 9 తేదీన విచారణకు రావాలని ఆదేశం
– మార్చి 16, 20, 21 తేదీల్లో ఈడీ విచారణకు హాజరైన కవిత
– ఈడీ విచారణపై సుప్రీంలో కవిత పిటిషన్
– 2024 జనవరి 16న మరోసారి విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు. సుప్రీంలో విచారణ జరుగుతోందని రాలేనని ఈడీకి కవిత లేఖ రాశారు.
– ఫిబ్రవరి 21న కవితకు నోటీసులు పంపిన సీబీఐ. 26న విచారణకు రావాలని ఆదేశం.
– ఫిబ్రవరి 23న కవితను కేసులో నిందితురాలిగా పేర్కొంది సీబీఐ.

 

You may also like

Leave a Comment