Telugu News » Delhi : బలపడుతున్న ఇండియా కూటమి.. సీట్ల షేరింగ్ పై కీలక ప్రకటన..!

Delhi : బలపడుతున్న ఇండియా కూటమి.. సీట్ల షేరింగ్ పై కీలక ప్రకటన..!

మిత్రపక్షాలన్నీ ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరించుకొని ఒక్కటవుడంతో హస్తం బలపడుతున్న సంకేతాలు వస్తున్నాయి.. నేడు భారత కూటమిలోని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సీట్ల షేరింగ్ పై పొత్తు కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి.

by Venu

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమి (India Alliance) మళ్ళీ బలపడుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ కారణాల వల్ల సమాజ్ వాదీ, టీఎంసీ, ఆప్ పార్టీలు దూరం కావడంతో ఇండియా కూటమి విచ్చిన్నమైందని ప్రచారం జరుగగా.. ఇప్పుడు అనూహ్యంగా కూటమి మళ్ళీ పుంజుకొవడంతో కాంగ్రెస్ (Congress)లో ఆశలు చిగురిస్తున్నాయని తెలుస్తోంది.

Problems in INDIA Alliance Meeting

మిత్రపక్షాలన్నీ ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరించుకొని ఒక్కటవుడంతో హస్తం బలపడుతున్న సంకేతాలు వస్తున్నాయి.. నేడు భారత కూటమిలోని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సీట్ల షేరింగ్ పై పొత్తు కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆప్-కాంగ్రెస్ కు చెందిన నేతలు కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ఐదు రాష్ట్రాల పొత్తులపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు హర్యానా, ఢిల్లీ, చండీగఢ్, గోవాతో పాటు గుజరాత్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్-ఆప్ కలిసి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈమేరకు హర్యానా ఎన్నికల్లో పోటీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు వెలువడే అవకాశం ఉందని సమాచారం. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో పొత్తును అధికారికంగా ప్రకటించడం ముఖ్యమైన విషయంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు. అయితే పంజాబ్​లో మాత్రం కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆప్​ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ తెలిపారు. పరస్పర అంగీకారంతోనే పంజాబ్​లో వేర్వేరుగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.

మరోవైపు ఢిల్లీ (Delhi)లో ఏడు లోక్‌సభ స్థానాలుండగా.. వాటిలో నాలుగు స్థానాల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi) పోటీ చేస్తుందని తెలుస్తోంది. వాటిలో పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ, తూర్పు ఢిల్లీ స్థానాలలో ఆప్ బరిలోకి దిగుతుండగా.. మిగతా మూడు స్థానాలైన చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ సిద్దపడుతుంది. ఈ నేపథ్యంలో పొత్తులకు సంబంధించి కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కలిసి ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించి సీట్ల షేరింగ్ పై పూర్తి వివరాలు తెలియచేయనున్నారని సమాచారం..

You may also like

Leave a Comment