Telugu News » Yadadri Power Plant: పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలి: భట్టి

Yadadri Power Plant: పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలి: భట్టి

రాష్ట్ర మంత్రుల బృందం శనివారం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించింది. భట్టితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు బేగంపేట నుంచి హెలికాప్టర్‌ వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు చేరుకున్నారు.

by Mano
Yadadri Power Plant: Focus on pending projects: Bhatti

తెలంగాణ(Telangana)లో పెండింగ్ ప్రాజెక్టు(Pending Projects)లపై దృష్టిసారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రుల బృందం శనివారం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించింది. భట్టితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు బేగంపేట నుంచి హెలికాప్టర్‌ వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు చేరుకున్నారు.

Yadadri Power Plant: Focus on pending projects: Bhatti

వీరికి సీఎండీ రిజ్వీ, కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందన దీప్తి స్వాగతం పలికారు. ముందుగా ప్లాంట్‌లో జరుగుతున్న పనులను పరిశీలించారు. అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎండీ అతిథి గృహంలో ప్రాజెక్టు పనులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలన్నారు.

ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రానున్న కాలంలో జరగాల్సిన పనులు, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అవకతవకలు, ఇంకా ఎంత మందికి పరిహారం అందాల్సి ఉందని మంత్రులు ఆరా తీశారు.

మరోవైపు జెన్కో సీఎండీ రిజ్వీ కీలక ప్రకటన చేశారు. 800 మెగావాట్ల చొప్పున ఉత్పత్తి చేసే 4వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 యూనిట్లలో ఈ ఏడాది చివరి నాటికి రెండు యూనిట్లను అందుబాటులోకి తెస్తామన్నారు. తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) యాదాద్రి థర్మల్ ప్లాంట్ పై ఈ నెల 20న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది.

You may also like

Leave a Comment