హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(HYD ORR) పై వరుస ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(MLA Lasya Nanditha) మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
కాగా ఆ ఘటన మరువక ముందే ఓఆర్ఆర్‌పై మరో రెండు ఓవర్ స్పీడ్ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఓఆర్ఆర్‌పై ఉన్న సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్‌పై ఒక ప్రమాదం జరిగింది. ఓ ట్రక్, కారు అతివేగంగా దూసుకొచ్చి సైక్లింగ్ ట్రాక్‌లోని ఓ సెక్షన్‌ను ఢీకొట్టాయి. ప్రమాదాల్లో సోలార్ ట్రాక్ నిర్మాణం కాస్త దెబ్బతింది.
సోలార్ సైకిల్ ట్రాక్ పై నుంచి ట్రాక్ డివైడర్ వైపు ఇన్నోవా కారు దూసుకెళ్లింది. ఇవాళ(శనివారం) తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఓవర్ స్పీడ్‌తో ట్రాక్‌పైకి కారు దూసుకువచ్చిందని పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు.
మరో ప్రమాదం ఓఆర్ఆర్ సమీపంలోని గోల్కొండ తారామతి వద్ద చోటుచేసుకుంది. కియా కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదానికీ అతివేగమే కారణంగా తెలుస్తోంది. రోడ్డుపక్కనే ఫుట్‌పాత్ పైకి కియా కారు దూసుకెల్లింది. పల్టీలు కొట్టడంతో కారులో ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.