Telugu News » PM Modi : కుటుంబీకుల భవిష్యత్తును తీర్చి దిద్దడంలో కాంగ్రెస్ బిజీగా ఉంది.. ప్రధాని మోడీ..!

PM Modi : కుటుంబీకుల భవిష్యత్తును తీర్చి దిద్దడంలో కాంగ్రెస్ బిజీగా ఉంది.. ప్రధాని మోడీ..!

స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిందని, కానీ ఆ పార్టీ దృష్టి కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై తప్ప.. దేశం కోసం ఆలోచించదని విమర్శించారు.

by Venu
PM Modi's remarks at beginning of the Budget Session of Parliament

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళలో బీజేపీ (BJP) దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ (Congress)పై కాషాయం నేతలు విమర్శలతో విరుచుకుపడుతున్నారు.. ఇదే సమయంలో ప్రధాన మంత్రి మోడీ (PM Modi) సైతం మాటల మిస్సెల్స్ తో దాడికి సిద్దం అయ్యారు.. ఇప్పటికే తీవ్ర విమర్శలతో హస్తానికి ఊపిరి అందనీయకుండా చేస్తున్న ప్రధాని.. మరో సారి.. కాంగ్రెస్ విధానాలను కడిగిపారేశారు.

PM Modi lays foundation stone for AIIMS Rewari

కాంగ్రెస్ అజెండాలో దేశాభివృద్ధి ఎప్పుడూ కనిపించదని ఆరోపించారు.. వికసిత్ భారత్ వికసిత్ కార్యక్రమంలో భాగంగా ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో ప్రసంగించిన మోడీ.. పరివార్‌వాదం (బంధుప్రీతి), అవినీతి, బుజ్జగింపులకు మించి కాంగ్రెస్ ఆలోచించదని విమర్శించారు. దేశ భవిష్యత్తును నిర్మించడం మరిచిపోయిందని ఎద్దేవా చేశారు.

స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిందని, కానీ ఆ పార్టీ దృష్టి కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై తప్ప.. దేశం కోసం ఆలోచించదని విమర్శించారు. రాయ్​పుర్​ (Raipur)లో రూ.34,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ వచ్చే ఐదేళ్లలో అవతరిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధిలో ఛత్తీస్‌గఢ్ కొత్త శిఖరాలకు చేరుకొంటుందని తెలిపారు.

ప్రస్తుతం కాంగ్రెస్ తమ కుమారులు, కుమార్తెల భవిష్యత్తును తీర్చి దిద్దడంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కుటుంబమే లేని మోడీకి, ప్రజలే కుటుంబమని, వారి కలలే ముఖ్యమని అన్నారు.. గత కాంగ్రెస్ ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్‌లోని పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేసిందని, కానీ బీజేపీ ప్రభుత్వం దానిని వేగవంతం చేసిందని తెలిపారు.

మరోవైపు, సహకార రంగం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం చేసిన పలు అభివృద్ధి పనుల గురించి క్లుప్తంగా వివరించారు.. మరోవైపు ద్వారక (Dwarka)లో దాదాపు రూ.980 కోట్లతో నిర్మించిన సుదర్శన్ సేతును మోడీ ప్రారంభించనున్నారు.

You may also like

Leave a Comment