Telugu News » Rains in Telangana: తెలంగాణకు చల్లని కబురు.. సిటీలో వర్ష సూచన..!

Rains in Telangana: తెలంగాణకు చల్లని కబురు.. సిటీలో వర్ష సూచన..!

నిన్నమొన్నటి వరకు ఎండవేడిమి, ఉక్కపోత ఉండగా ఇప్పుడు వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఒక ఎత్తైన ఉపరితల ద్రోణి ఉంది.

by Mano
Rain Alert:

తెలంగాణ(Telangana) ప్రజలకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు(Temperature) ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. నిన్నమొన్నటి వరకు ఎండవేడిమి, ఉక్కపోత ఉండగా ఇప్పుడు వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఒక ఎత్తైన ఉపరితల ద్రోణి ఉంది.

Rains in Telangana: Cold weather for Telangana.. Rain forecast in the city..!

దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నేడు మరాఠ్వాడా నుంచి దక్షిణ థమినాడు వరకు కర్ణాటక అంతర్భాగం మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో నేడు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి చెదురుమొదురు వర్షాలు(Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం వాతావరణ మేఘావృతమై ఉంది. రానున్న 48 గంటల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. జంటనగరాల్లో సాయంత్రం వేళల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.

ఇక ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డిలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. గరిష్ఠ, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 22 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 4 నుంచి 6 కి.మీ వేగంతో ఉపరితల గాలులు దక్షిణ, నైరుతి దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 33.7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలు. గాలి తేమ 79 శాతంగా నమోదైంది.

You may also like

Leave a Comment