Telugu News » Kolkata: ల్యాండింగ్‌కు ముందు పైలట్ కళ్లకు లేజర్.. తప్పిన ముప్పు..!

Kolkata: ల్యాండింగ్‌కు ముందు పైలట్ కళ్లకు లేజర్.. తప్పిన ముప్పు..!

కోల్‌కతా(Kalakatha) విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్‌ కిలోమీటరు దూరంలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఇండిగో ఫ్లైట్ నంబర్ 6E 223 విమానం బెంగళూరు(Bangurlu) నుంచి బయలుదేరింది.

by Mano
Kolkata: Laser to pilot's eyes before landing.. Missed threat..!

ఇండిగో(Indigo) విమానం ల్యాండ్ అయ్యే ముందు పైలట్ కళ్లకు లేజర్ కిరణాలు తగిలిన విషయం వెలుగులోకి వచ్చింది. కోల్‌కతా(Kolkata) విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్‌ కిలోమీటరు దూరంలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఇండిగో ఫ్లైట్ నంబర్ 6E 223 విమానం బెంగళూరు(Bangalore) నుంచి బయలుదేరింది. ఆ సమయంలో విమానం కాక్పిట్ వైపు లేజర్ కాంతి ప్రకాశించింది.

Kolkata: Laser to pilot's eyes before landing.. Missed threat..!

దీంతో విమానంలో ఉన్న పైలట్ల కళ్ల ముందు కొద్దిసేపు చీకటి అలుముకుంది. అయితే విమానం సురక్షితంగానే ల్యాండ్ అవడంతో అంతా ఊపిరిగిపీల్చుకున్నారు. ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై బిధాన్ నగర్ పోలీస్ స్టేషన్‌ ఫిర్యాదు నమోదైంది. ఇలాంటి చర్య విమాన భద్రతకు ప్రమాదకరమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇండిగో విమానయాన సంస్థకు చెందిన ఈ విమానంలో 165మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ విమానం శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది.  ఎన్ఎసీబీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు పంపినట్లు విమానాశ్రయ అధికారి తెలిపారు. లేజర్ లైట్ల సమస్య, విమానాలకు వాటి ముప్పుపై గత వారం ఎయిర్‌పోర్ట్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా బెంగాల్ హోం శాఖ కార్యదర్శి నందిని చక్రవర్తి కూడా ఈ అంశంపై కూలంకషంగా చర్చించారు. ల్యాండింగ్ సమయంలో లేజర్ కిరణాల వల్ల పైలట్లు కంటి చూపు కోల్పోకుండా ఉండేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చర్యలు చేపట్టింది. దీని కింద విమానాశ్రయాల చుట్టూ లేజర్ లైట్ల కోసం 18.5 కి.మీ-వ్యాసార్థం మినహాయింపు జోన్ తప్పనిసరి చేశారు.

You may also like

Leave a Comment