రాజకీయాల్లోకి వచ్చిన వారి ఆస్తులు పెరుగుతున్నాయి.. పాలకులు మారుతున్నారు.. కానీ రైతుల బ్రతుకులు మాత్రం ఎప్పుడు ఒడిదుడుకుల ప్రయాణంలా సాగడం కనిపిస్తుంది. పండిన పంటకు గిట్టుబాటు ధర లేక.. ప్రకృతి సహకరించక.. చేసిన అప్పులు తీరక ఇలా అడుగడుగున అవరోధాలు పలకరిస్తున్నా నిరతంతరం శ్రమిస్తున్న కర్షకుడికి.. పాలకుల కనికరం కోసం ఎదురు చూడటం తప్పడం లేదు..
ఇక తాజాగా ఒక రైతు అధికారులు పట్టించుకోలేదని.. చెరుకు తోట (Sugarcane plantation)కు నిప్పంటించాడు.. మెదక్ (Medak) జిల్లా కౌడిపల్లి (Kaudipalli) మండలం సదాశివ పల్లి (Sadashiva Palli) గ్రామానికి చెందిన రైతు తన చెరుకు తోటకు నిప్పంటించాడు. ఆఫీసుల చుట్టూ ఎంత తిరిగినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదనతో.. ఇలా చేశానని రైతు కృష్ణ గౌడ్ తెలిపారు.
చెరువు కట్టపై నుంచి పంట పొలానికి 6 సంవత్సరాల క్రితం దారి ఏర్పాటు చేసుకోన్నానని పేర్కొన్నారు. అయితే ఇదే గ్రామానికి చెందిన కొందరు కక్షపూరితంగా దాన్ని తొలగించారని అధికారులకు కంప్లేంట్ ఇచ్చాడు. తన పట్ట భూమి నుంచే దారిని తొలగించడంతో.. ఆగ్రహించిన రైతు.. ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపించాడు. ఇప్పటివరకు తనకు న్యాయం జరగలేదని ఆవేదనతో చెరుకు తోటకు నిప్పటించాయినట్లు తెలిపాడు.