Telugu News » Maharashtra : మహారాష్ట్రలో మాయం అవుతున్న బీఆర్ఎస్.. ముఖం చాటేస్తున్న రాష్ట్ర నేతలు..!?

Maharashtra : మహారాష్ట్రలో మాయం అవుతున్న బీఆర్ఎస్.. ముఖం చాటేస్తున్న రాష్ట్ర నేతలు..!?

ఆ సమయంలో కారు జోరు చూసిన ఎన్సీపీ, శివసేనకు చెందిన పలువురు కీలక నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ బాస్‌ సైలెంట్ అయ్యారు..

by Venu
KCR in a state of disorientation.. If you think my strength and strength, did you leave me alone?

పోయిన చోటే వెతుక్కోవాలని పెద్దలు అన్నారు.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో గాడి తప్పిన బీఆర్ఎస్ (BRS)ను.. లోక సభ సమరంలో సరిచేద్దామనే భావనలో ఉన్న పెద్ద బాస్ కు మహారాష్ట్ర (Maharashtra) బీఆర్ఎస్ నేతలు షాకిచ్చారు.. కేసీఆర్‌ (KCR)పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారు.. ఘాటు లేఖను రాశారు. బీఆర్ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మహారాష్ట్రలో పార్టీ నియమించిన ఆరుగురు కో-ఆర్డినేటర్లు ఇటీవల సమావేశమైయ్యారు..

తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన వారు.. మహారాష్ట్రలో బీఆర్ఎస్ మనుగడ కష్టమే అన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ అధిష్టానం మహారాష్ట్ర పార్టీ ఆఫీసులకు అద్దె చెల్లింపు నిలిపివేసిందని సమాచారం. అదీగాక అక్కడి నేతలు ఫోన్లు చేస్తుంటే బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. అదీగాక బీఆర్‌ఎస్‌లో చేరి రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అదే విధంగా మహారాష్ట్రలో వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో చెప్పాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వాలని మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు లేఖ రాశారు. ఇదిలా ఉండగా దేశాన్ని ఏలుదామనే కోరికతో కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) ముందు మహారాష్ట్రలో పలు బహిరంగ సభలు నిర్వహించారు. అబ్‌ కి బార్‌-కిసాన్‌ సర్కార్‌ నినాదంతో తెలంగాణ (Telangana) తర్వాత తన రాజకీయ క్షేత్రంగా మహారాష్ట్రను ఎంచుకొన్నారు.

ఆ సమయంలో కారు జోరు చూసిన ఎన్సీపీ, శివసేనకు చెందిన పలువురు కీలక నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ బాస్‌ సైలెంట్ అయ్యారు.. దీంతో మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు ఎటు తేల్చుకోలేకపోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక దేశ రాజకీయాల్లో తన సత్తా చాటాలని భావించిన కేసీఆర్ ఇప్పుడు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు ఏం సమాధానం చెబుతారనే ఆసక్తి నెలకొంది.

You may also like

Leave a Comment