రాజకీయాల్లోకి మరో స్టార్ క్రికెటర్ అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీమ్ఇండియా పేసర్ మహమ్మద్ షమి (Mohammad Shami) భాజపాలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో (Lok sabha Elections) ఆయన పశ్చిమ బెంగాల్ (West Bengal) నుంచి కమలం తరపున పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

అందుకు మహమ్మద్ షమిని బరిలోకి దించి ఓటింగ్ రాబట్టుకోవాలనే ఆలోచనలో ముందుకు వెళ్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే పశ్చిమ బెంగాల్‌లోని బసిర్హత్ నియోజకవర్గం నుంచి ఆయనను బరిలోకి దించాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బసిర్హత్ నియోజకవర్గానికి తృణమూల్ కాంగ్రెస్ తరఫున నుస్రత్ జహాన్ ఎంపీగా ఉన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సందేశ్‌ఖాలీ ప్రాంతం ఈ నియోజకవర్గ పరిధిలోనిదే.
మరోవైపు రాజకీయ ఎంట్రీ పై షమీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం గాయపడ్డ షమీ.. సర్జరీ నుంచి కోలుకుంటున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రధాని అతనికి విషెస్ కూడా చెప్పారు. తాజాగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఇక గతేడాది వన్డే ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో భారత్ ఓడిపోయిన తర్వాత కూడా ప్రధాని టీమిండియా ఆటగాళ్లను కలిసి ఓదార్చిన విషయం తెలిసిందే.