జగిత్యాల (Jagityala) జిల్లాలో కల్యాణ లక్ష్మి (Kalyana Lakshmi) చెక్కుల పంపిణీ కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది.. తహసీల్దార్ కార్యలయంలో నేడు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar), ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి (Jeevan Reddy) పాల్గొన్నారు.

ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఫొటో ఎందుకు లేదని వాదించారు. అంతకు ముందు ప్రభుత్వ పథకాలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడకుండా అడ్డుకొన్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ లక్ష్మణ్ లు రెండు వర్గాల వారిని సముదాయించారు.