ఖమ్మం (Khammam) జిల్లాకు నాకు అవినాభావ సంబంధం ఉందని, నా చిన్ననాటి స్నేహితులు ఇక్కడ ఉన్నారని జస్టిస్ ఎన్వీ రమణ (N.V Ramana) తెలిపారు. నేడు ఆయనకు ఖమ్మంలో సన్మానం జరిగింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పదవిలో ఉన్నప్పుడు సన్మానం చేయడం సహజమని, నేను పదవి విరమణ చేసి సంవత్సరం దాటింది. అయినా వెంటాడి మరీ నాకు సన్మానం చేయడం ఎందుకో అర్ధం కాలేదన్నారు..
గతంలో నేను ఖమ్మం వచ్చి మూడు భవనాలకు శంఖుస్థాపన చేసి వెళ్ళానని గుర్తు చేసిన ఎన్వీ రమణ.. ఆ పని ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. భారత దేశంలో న్యాయ వ్యవస్థకు ప్రాధాన్యత లేదన్న విషయం ఆ రోజు అర్ధం అయిందని వ్యాఖ్యానించారు. ఈ జిల్లా నుంచి ముగ్గురు న్యాయమూర్థులను తయారు చేసానని గుర్తు చేశారు.. ఖమ్మం అనే పేరుకు ఎన్ని బిరుదులు ఇచ్చిన తక్కువే అని పేర్కొన్నారు..
అదేవిధంగా ఖమ్మంకు ఉద్యమాల జిల్లా, ఉద్యమాల ఖిల్లా, పోరాటాల గడ్డ, పోరాటాల బావుటా అనే పేర్లు ఉన్నాయని, పుచ్చలపల్లి గారు రాసిన పుస్తకాలు చదివితే ఇక్కడ కలియ తిరిగినట్లే ఉంటుందని ఎన్వీ రమణ తెలిపారు. అంతేకాకుండా.. కమ్యూనిష్టు పార్టీ (Communist Party) నాయకులు మా ఇంట్లో ఉండి సాయుధ పోరాటాలు చేశారని గుర్తు చేసుకొన్నారు.. మా నాన్న గారు ఎన్నో పోరాటాల గూర్చి మాకు చెప్పేవారని అన్నారు.
ఎంతోమంది కమ్యూనిష్టు నాయకులను కన్న ఖమ్మంలో.. బోడెపుడి, మంచికంటి, శీలం సిద్దారెడ్డి, జలగం వెంగళరావు, రజాబ్ అలీ లాంటి మేధావులకు పురుడు పోసిన గడ్డ ఇదని పేర్కొన్నారు.. అలనాటి నాయకులను మర్చిపోకూడదు.. ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన గడ్డను మర్చిపోవద్దని ఎన్వీ రమణ తెలిపారు. మంత్రి తుమ్మల సమర్డత నాకు తెలుసు.. ఆయన ఉంటే అభివృద్ధి ఉన్నట్టే అని అన్నారు..
మహాకవి దాశరధి (Dasharadhi) కవితలు ఆమోఘం.. కిన్నెరసాని నది చరిత్ర ఎంతో గొప్పదని తెలిపిన ఎన్వీ రమణ.. భక్త రామదాసు పుట్టిన నేల ఇది.. సీతమ్మ చీర ఆనవాళ్ళున్న ప్రాంతం ఇదని వివరించారు. అదేవిధంగా నేటి యువతకు ఓ సందేశం ఇచ్చారు. అభివృద్ధి, లక్షల్లో జీతం, ఎదుగుదల ఇవి అవసరమే.. కానీ సామాజిక సేవ కూడా అవసరమే.. అయిన చేయట్లేదన్నారు.. అందువల్ల ధనికులు పేదలకు మధ్య అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు..
పక్కింటి వాడు కూడా ఎదిగేలాగా మనం సహకరించాలని తెలిపిన ఎన్వీ రమణ.. పేదరికం వల్ల అశాంతి వస్తుందని కాబట్టి సమాజ స్పృహ అవసరం అని పేర్కొన్నారు. దేశమంటే మట్టి కాదోయ్ అనే పద్యం పాడిన రమణ.. మాతృభాష అంతరించే ప్రమాదం ఉందని తెలిపారు. సంస్కృతి, సాంప్రదాయం బ్రతికించవలసిన అవసరం ఉందని అన్నారు.. ఆంగ్లభాష అవసరమే కానీ మాతృ భాషను మరిచిపోవద్దని సూచించారు..
ఏ దేశం వెళ్లినా మూలాలు మర్చిపోవద్దన్నారు.. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, గ్రామాన్ని, స్నేహితులను మర్చిపోవద్ద తెలిపారు.. నీ గొప్పతనాన్ని చెప్పుకొనేది నీ గ్రామంలోనే అన్నారు.. అమ్మను మరవద్దు, అమ్మభాషను మరచిపోవద్దని సూచించారు.. మనిషిగా పుట్టినందుకు కొంతైనా త్యాగం అవసరమని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు..