Telugu News » Congress : సంగంబండ లోలెవల్ కెనాల్ వద్ద బండను పగలగొడతాం..!

Congress : సంగంబండ లోలెవల్ కెనాల్ వద్ద బండను పగలగొడతాం..!

ఎకో టూరిజం కింద ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, సంగంబండ ఖాళీ భూముల్లో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు తీసుకొంటామని వివరించారు.

by Venu
Uttam Kumar Reddy: The biggest scam in the country.. Madigadda was used as an ATM: Uttam

నారాయణపేట (Narayanapeta) జిల్లాలోని సంగంబండ ప్రాజెక్టును (Sangambanda project) నేడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాదీవెన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు..

Battiసంగంబండ, లోలెవల్ కెనాల్ పూర్తికి బండ అడ్డంగా ఉందని తెలిపిన ఉత్తమ్‌.. అడ్డంకిగా ఉన్న 500 మీటర్ల బండను తొలగించి నీరందిస్తామని తెలిపారు. భీమా ఎత్తిపోతల కింద పరిహారం, పునరావాస సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.. మక్తల్‌ నుంచి వచ్చే అన్ని ప్రతిపాదనలను ఆమోదిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పైసల కోసం కాకుండా.. ప్రజల కోసం సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడంలో శ్రద్ధ వహిస్తామని పేర్కొన్నారు..

గత ప్రభుత్వం పైసల కోసం మాత్రమే ప్రాజెక్టులు చేపట్టిందని ఉత్తమ్ విమర్శించారు.. ఐదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి, భీమా, కోయల్‌సాగర్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామని, అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు వచ్చేలా చూస్తామని అన్నారు.. వంశీచంద్‌రెడ్డి ఎంపీ అయితే పాలమూరు మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సంగంబండ లోలెవల్ కెనాల్ వద్ద బండను పగలగొడతామని పేర్కొన్నారు. బండను తొలగిస్తే 20,000ల ఎకరాలకు నీళ్లు అందుతాయని పేర్కొన్నారు.. ఎకో టూరిజం కింద ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, సంగంబండ ఖాళీ భూముల్లో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు తీసుకొంటామని వివరించారు. మక్తల్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే శ్రీహరి కష్టపడుతున్నారని భట్టి వెల్లడించారు.

You may also like

Leave a Comment