Telugu News » Yadagirigutta : సోషల్ మీడియా ఎఫెక్ట్.. యాదాద్రి ఆలయ ఈవో బదిలీ-కొత్త ఈవో ఎవరంటే..?

Yadagirigutta : సోషల్ మీడియా ఎఫెక్ట్.. యాదాద్రి ఆలయ ఈవో బదిలీ-కొత్త ఈవో ఎవరంటే..?

నష్ట నివారణ చర్యల్లో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఆలయ ఈవో రామకృష్ణరావుపై ట్రాన్స్ ఫర్ వేటు వేసింది. ఆయన స్థానంలో భాస్కర్‌రావుని ఆలయ ఈవోగా ప్రభుత్వం నియమిస్తూ జీవో జారీ చేసింది.

by Venu

యాదాద్రి (Yadadri)ఆలయ ఈవో (EO) రామకృష్ణ రావును బదిలీ చేస్తున్నట్లు తెలంగాణ (Telangana) ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) యాద్రాద్రి పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)ను వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చే సమయంలో మిగతా మంత్రుల కంటే కాస్త తక్కువ ఎత్తున్న స్టూల్‌పై కూర్చోబెట్టారు.

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారి.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అదీగాక ఉప ముఖ్యమంత్రికి అవమానం అంటూ పెద్ద ఎత్తున దుమారం నెలకొంది. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం సైతం స్పందించారు. అవమానం లాంటిది ఏమీ లేదని… తానే కింద కూర్చున్నానని చెప్పుకొచ్చారు. అయినా నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆలయ ఈవో పై చర్యలు అధికారులు తీసుకొన్నారు. మొత్తానికి సోషల్ మీడియా ఆలయ ఈవో ఉద్యోగానికి చిక్కులు తెచ్చింది.

మరోవైపు యాదాద్రి ఆలయ ఈవోగా భాస్కరరావు‌ను బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. దీంతో తీవ్ర విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల నోర్లకు తాళం పడినట్లే అని భావిస్తున్నారు.. ఇక ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు నానా యాగీ చేసిన విషయం తెలిసిందే.. అయితే నష్ట నివారణ చర్యల్లో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఆలయ ఈవో రామకృష్ణరావుపై ట్రాన్స్ ఫర్ వేటు వేసింది. ఆయన స్థానంలో భాస్కర్‌రావుని ఆలయ ఈవోగా ప్రభుత్వం నియమిస్తూ జీవో జారీ చేసింది.

You may also like

Leave a Comment