ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం(Israel-Hamas War) ఇప్పట్లో ముగిసేలా లేదు.. రోజు రోజుకూ గాజాలో మరణాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఆహారం కోసం క్యూలైన్లో నిలబడిన పాలస్తీయన్లపై ఇజ్రాయెల్ సైనికులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో దాదాపు 20 మంది మృతిచెందగా 150మందికి పైగా గాయాలపాలయ్యారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిచింది.
అనేక మంది పాలస్తీయన్లు కాల్పులు, బాంబు దాడులకు బాధితులుగా మారుతున్నారు. యుద్ధం నేపథ్యంలో గాజావాసులకు సరైన తిండి లేక అల్లాడుతున్నారు. ఆహారం, నిత్యావసరాల వస్తువులు లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో రోడ్డు, వాయు, సముద్రం మార్గాల ద్వారా గాజాకు ప్రపంచ దేశాల నుంచి మానవతా సాయం అందుతోంది.
అయితే, తొలిసారిగా గాజాకు సముద్ర మార్గం ద్వారా మానవతా సాయం అందింది. UAE నిధులతో కూడిన ఓడ మంగళవారం బయల్దేరింది. WCKitchen నుంచి ఈ సహాయం గాజాకు అందింది. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఇజ్రాయెల్ సైన్యాలు ఒక్కసారిగా అక్కడి ప్రజలపై దాడి చేయడంతో ఈ దారుణం చోటు చేసుకుంది.
ఇంతలో, ఆహారం కోసం ఎదురుచూస్తున్న చాలా మంది పాలస్తీయన్లపై ఇజ్రాయెల్ సైనికుల కాల్పుల్లో మృతిచెందారు. గాజాలోని కువైట్ క్రాస్ రోడ్స్ దగ్గర ఈ దాడి జరిగింది అని పేర్కొన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అల్ షిఫా ఆసుపత్రి అత్యవసర విభాగంలో వైద్యుడు మహ్మద్ గరాబ్ తెలిపారు.