శ్రీలంక (SriLanka) స్టార్ బ్యాట్స్‌మెన్, లాహిరు తిరిమన్నె (Lahiru Thirimanne) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కుటుంబ సభ్యలతో కలిసి గురువారం ఆలయానికి వెళ్తుండగా.. అనురాధపుర (Anuradhapura) సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో తిరిమన్నెతో పాటు అతడి కుటుంబ సభ్యులకు గాయలయ్యాయి.
ఈ ప్రమాదాన్ని గమనించి స్థానికులు వెంటనే రక్షణ చర్యలు చేపట్టారు.. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యంగా నిలకడగా ఉందని సమాచారం.. కాగా తిరిమన్నెకు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొన్న శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రిలో ఉన్న తిరిమన్నె త్వరగా కోలుకోని గ్రౌండ్లోకి అడుగుపెట్టాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు..
ఇక ఈ ఎడమచేతి వాటం బాట్స్మెన్ లాహిరు తిరిమన్నె 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు.. అప్పటి నుంచి 44 టెస్టులు, 127 వన్డేలు, 26 టీ 20 మ్యాచ్‌లు ఆడారు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 2,088, 3,164, 291 పరుగులు చేశారు. అయితే గతేడాది ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన లాహిరు తిరిమన్నె ప్రస్తుతం లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీ-2024 ఈవెంట్లో పాల్గొంటున్నారు.. అదేవిధంగా న్యూయార్క్ స్ట్రైకర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు..