ఎన్నికల నగారా దేశవ్యాప్తంగా మోగింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ (Election Schedule)ను నిన్న ఈసీ వెల్లడించింది. ఢిల్లీ (Delhi) విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajeev Kumar) ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏడు దశల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు సిక్కిం రాష్ట్రాల్లో ఏప్రిల్ 19న ఓటింగ్, జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల కౌంటింగ్ ప్రక్రియను తొలుత ప్రకటించిన తేదీ కంటే రెండు రోజులు ముందే నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం అరుణాచల్ ప్రదేశ్‌లో 60 స్థానాలకు, సిక్కింలో 32 స్థానాలకు మొదటి దశలోనే ఎన్నికలు జరగనున్నాయని స్పష్టం చేసింది.