తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్(Telangana New Governer)గా సీ.పీ రాధాకృష్ణన్ (C.P.Radakrishnan) నియమితులయ్యారు.ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (India president Droupadi murmu) ఆయన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ఈయన ఝార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఆర్డర్స్ పాస్ చేశారు.
తెలంగాణ నూతన గవర్నర్గా నియామకమైన సీపీ రాధాకృష్ణన్ నేపథ్యం చూసుకుంటే ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడు. గతంలో తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన 12 ఫిబ్రవరి 2023లో ఝార్ఖండ్ గవర్నర్గా అపాయింట్ అయ్యారు. తాజాగా మాజీ గవర్నర్ తమిళి సై స్థానంలో తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు.
నిన్నటివరకు తెలంగాణ గవర్నర్గా కొనసాగిన తమిళి సై సౌందర్ రాజన్ సోమవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.వెంటనే రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించగా ద్రౌపదీ ముర్ము దానిని ఆమోదించారు. క్రియాశీల రాజకీయాల్లోకి వెళ్లేందుకు తమిళి సై ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారని తెలిసింది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారిలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇదే విషయంపై మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించగా సమాధానం దాటవేశారని తెలిసింది.