ఇటీవల గుండెపోటు(Heart Attack) మరణాలు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. పాఠశాలకు వెళ్లే విద్యార్థులూ గుండెపోటు బారిన పడుతున్నారు. తాజాగా టెన్త్ విద్యార్థిని(10th Class Student)కి గుండెపోటు రావడంతో మృతి చెందింది.
ఈ సంఘటన కడప జిల్లా(Kadapa District) రాజుపాలెం మండలం(Rajupalem Mandalam) కొర్రపాడు(Korrapadu) గ్రామంలో చోటుచేసుకుంది. పాఠశాలలో పరీక్షకు ప్రిపేర్ అవుతున్న సమయంలో లిఖిత(Likhitha) అనే విద్యార్థిని హఠాత్తుగా కుప్పకూలింది. గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
విద్యార్థిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలు రోజూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తోంది విద్యాశాఖ.
పరీక్షల సమయం కావడంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని అధిగమించి పరీక్షలు రాస్తున్నారు. నిద్రలేమి, ఒత్తిడి కారణంగా విద్యార్థులకు అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముందని వైద్యులు సూచిస్తున్నారు.