రెండంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన ఢిల్లీ(Delhi)లోని కబీర్ నగర్(Kabir Nagar)లో చోటుచేసుకుంది. నిర్మాణ దశలో ఉన్న ఓ భవనం ఇవాళ(గురువారం) తెల్లవారుజామున 2.30గంటలకు కుప్పకూలింది. ఆ సమయంలో అందులో కొందరు కార్మికులు పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా.. ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(Delhi Municipal Corporation) సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సాయంతో సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక జీటీబీ ఆస్పత్రికి తరలించారు. వారిలో అర్షద్, తౌహీద్గాలు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సమాచారం.
రెహాన్, అరుణ్, నిర్మల్, జలధర్ లు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. భవన నిర్మాణానికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే, భవనం కూలిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
భవనం కూలిన సమయంలో అందులో 13మంది కార్మికులు పనిచేస్తున్నట్లు గుర్తించామని డీసీపీ రాజేష్ డియో తెలిపారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారి అనుప్ మాట్లాడుతూ.. సమాచారం వచ్చిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టామన్నారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కూలీలను బయటకు తీసినట్లు పేర్కొన్నారు. గాయపడిన వారికి చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించామన్నారు.
#WATCH | Delhi: At around 2:16 am, a call was received regarding the collapse of a two-storey, old construction building in Kabir Nagar, Welcome. Two workers Arshad (30) and Tauhid (20) were declared dead at GTB Hospital while another worker Rehan (22) is critical and is being… pic.twitter.com/2Zjw6WmgMo
— ANI (@ANI) March 21, 2024