Telugu News » Pushpak: ఇస్రో మరో ఘనత.. ‘పుష్పక్’ ప్రయోగం విజయవంతం..!

Pushpak: ఇస్రో మరో ఘనత.. ‘పుష్పక్’ ప్రయోగం విజయవంతం..!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో ఘనత సాధించింది. అభివృద్ధి చేస్తున్న భారత మొట్టమొదటి పునర్వినియోగ లాంచ్ వెహికల్ ‘పుష్పక్‌ విమాన్‌’ (Pushpak) ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఎక్స్ వేదికగా వెల్లడిచింది.

by Mano
Pushpak: Another success of ISRO.. 'Pushpak' launch successful..!

రోదసీ ప్రయాణాలు అత్యంత సులభతరం చేసేందుకు చేపట్టిన అత్యంత కీలకమైన ప్రయోగం విజయవంతమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో ఘనత సాధించింది. అభివృద్ధి చేస్తున్న భారత మొట్టమొదటి పునర్వినియోగ లాంచ్ వెహికల్ ‘పుష్పక్‌ విమాన్‌’ (Pushpak) ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఎక్స్ వేదికగా వెల్లడించింది.

Pushpak: Another success of ISRO.. 'Pushpak' launch successful..!

ఆర్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇస్రోకు ఇది మూడోది. 6.5 మీటర్ల పొడవు, 1.75 టన్నుల బరువుండే ‘పుష్పక్‌’ను ఆకాశంలో ఓ ఐఏఎఫ్‌ హెలికాప్టర్‌ నుంచి భూమిపై నిర్దేశిత లక్ష్యం వైపు ప్రయోగిస్తారు. దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో పరీక్షించారు. ‘పుష్పక్‌ విమాన్‌’ను కర్ణాటకలోని రక్షణశాఖకు చెందిన ‘చాలకెరె రన్‌వే’ నుంచి ఉదయం 7 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

ఇందులో భాగంగా పుష్పక్ తానంతట తానుగా రన్‌వే‌పై ల్యాండైంది. అత్యంత సంక్లిష్టమైన ‘రొబోటిక్‌ ల్యాండింగ్’ సామర్థ్యాన్ని సాధించేందుకు ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఇది సింగిల్ స్టేజ్ టూ ఆర్బిట్ రాకెట్. పీఎస్‌ఎల్‌వీ లాగా వివిధ దశలకు బదులు ఒకే దశలో కక్ష్యలోకి చేరుకుంటుంది.  గతేడాది జరిపిన పరీక్షలో ఎయిర్‌ఫోర్సు హెలికాఫ్టర్ నుంచి వదిలిన పుష్పక్ మానవుల నియంత్రణ లేకుండా తనంతట తానుగా ల్యాండయింది.

దీంతో, ఆర్బిటల్ రీఎంట్రీ సామర్థ్యం సముపార్జనలో ఒకడుగు ముందుకు వేసింది. ఇస్రో నిర్మించబోయే అంతరిక్ష స్పేస్ స్టేషన్‌కు విడిభాగాలు, వ్యోమగాముల తరలింపులో ఈ రాకెట్ కీలకం కానుంది. రూ. 100 కోట్లతో ఇస్రో ‘పుష్పక్ విమాన్’ ప్రాజెక్టు చేపట్టింది. 2012లో ఈ రాకెట్ డిజైన్‌కు ఆమోదం లభించడంతో ఇస్రో ఆర్ఎల్‌వీ-టీడీ పేరిట ఓ ప్రయోగాత్మక పునర్వినియోగ రాకెట్ మోడల్‌ను రూపొందించింది. ఈ రాకెట్‌ సామర్థ్యాలను 2016లో తొలిసారిగా పరీక్షించారు.

You may also like

Leave a Comment