టీడీపీ మూడో జాబితా(TDP 3rd List) విడుదలైంది. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల పొత్తులో భాగంగా టీడీపీ(TDP) 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
దీంతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు విడతల్లో 128 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా మరో 11 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు 139 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు.
మరో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు టీడీపీ పోటీ చేయనున్న 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తాజాగా 13 నియోజకవర్గాలకు టీడీపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది.
అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు
- పాతపట్నం- మామిడి గోవిందరావు
- శ్రీకాకుళం-గొండు శంకర్
- నరసరావుపేట – చదలవాడ అరవిందబాబు
- చీరాల- మద్దులూరి మాలకొండయ్య యాదవ్
- పలాస-గౌతు శిరీష
- సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
- అమలాపురం (ఎస్సీ) – అయితాబత్తుల ఆనందరావు
- పెనమలూరు-బోడె ప్రసాద్
- మైలవరం- వసంత వెంకట కృష్ణప్రసాద్
- శృంగవరపుకోట- కోళ్ల లలితకుమారి
- కాకినాడ సిటీ- వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)
లోక్‌సభ స్థానాల అభ్యర్థులు
- విశాఖపట్నం- మతుకుమిల్లి భరత్
- విజయవాడ- కేశినేని శివనాథ్ (చిన్ని)
- హిందూపురం- బీకే పార్థసారథి
- శ్రీకాకుళం- కింజరాపు రామ్మోహన్నాయుడు
- అమలాపురం- గంటి హరీష్
- ఏలూరు- పుట్టా మహేశ్ యాదవ్
- గుంటూరు- పెమ్మసాని చంద్రశేఖర్
- నరసరావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయలు
- బాపట్ల – టి. కృష్ణ ప్రసాద్
- చిత్తూరు- దగ్గుమళ్ల ప్రసాదరావు
- కర్నూలు- బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు)
- నంద్యాల – బైరెడ్డి శబరి
- నెల్లూరు- వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి