Telugu News » Sheep Scam: గొర్రెల స్కామ్‌ కేసు.. మూడో రోజు విచారణ షురూ..!

Sheep Scam: గొర్రెల స్కామ్‌ కేసు.. మూడో రోజు విచారణ షురూ..!

గొర్రెల పంపిణీ పథకంలోనూ భారీ స్కామ్‌పై విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసు(Sheep Scam)లో ఏసీబీ విచారణ సోమవారం ఉదయం బంజారాహిల్స్ ఏసీబీ(ACB) ప్రధాన కార్యాలయంలో మూడో రోజు విచారణ చేపట్టింది.

by Mano
Sheep Scam: Gorela scam case.. third day of investigation..!

గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలో వివిధ ప్రభుత్వ శాఖలు, పథకాల్లో జరిగిన అవినీతిపై రేవంత్ సర్కార్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా గొర్రెల పంపిణీ పథకంలోనూ భారీ స్కామ్‌పై విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసు(Sheep Scam)లో ఏసీబీ విచారణ సోమవారం ఉదయం బంజారాహిల్స్ ఏసీబీ(ACB) ప్రధాన కార్యాలయంలో మూడో రోజు విచారణ చేపట్టింది.

Sheep Scam: Gorela scam case.. third day of investigation..!

ఈ స్కాంలో జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య కీలకంగా వ్యవహరించారు. వీరు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై నకిలీ పత్రాలు, బ్యాంక్ ఖాతాలు సృష్టించారు. ప్రభుత్వ నిధులను కోట్లలో పక్కదారి పట్టించారు. అంతకుముందు కూడా పలువురు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అంజిలప్ప, కృష్ణయ్యలను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని మూడు రోజులైంది. మొత్తం ఐదు రోజుల పాటు అంజిలప్పను ఏబీబీ విచారించనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కస్టడీ విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. సాయంత్రం 6 గంటలకు తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటి వరకు గొర్రెల స్కామ్ విషయమై సీబీఐ అధికారులు ఇద్దరి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఈ స్కాంకు సంబంధించి పశుసంవర్ధక శాఖలోని మరికొందరి పాత్రపై ఏసీబీ ఆరా తీస్తోంది. ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయిదుద్దీన్‌కు, నిందితులకు గల సంబంధాలపై ఆరాతీస్తున్నట్లు సమాచారం. సుమారు రూ.2కోట్లా 10లక్షలను బినామీ ఖాతాల్లోకి మళ్లించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

You may also like

Leave a Comment