Telugu News » Attempted siege of Telangana DGP office: జీవో నెంబరు 46పై డీజీపీ కార్యలయ ముట్టడికి ప్రయత్నం

Attempted siege of Telangana DGP office: జీవో నెంబరు 46పై డీజీపీ కార్యలయ ముట్టడికి ప్రయత్నం

ఊహించని ఈ పరిణామంతో అలర్టైన పోలీసులు వాళ్లని అడ్డుకున్నారు. ముట్టడికి ప్రయత్నించిన వారందరిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

by Prasanna
dgp

జీవో నెంబరు 46 వలన తాము తీవ్రంగా నష్టపోతున్నామని తెలంగాణా డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు కానిస్టేబుల్‌ అభ్యర్థులు. తెలంగాణా డీజీపీ కార్యాలయం ముట్టడి (Attempted siege) కి ప్రయత్నించడంతో ఇవాళ (శుక్రవారం) అక్కడ తీవ్ర ఉద్రిక్తత (Tension at DGP ofice) చోటు చేసుకుంది.

జీవో నెంబర్‌ 46 పై శాంతియుత నిరసన తెలిపేందుకు కానిస్టేబుల్ అభ్యర్థులు అనుమతి తీసుకున్నారు. అయితే అసెంబ్లీ (Telangana Aseembly) వైపుగా వస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థులు ఒక్కసారిగా డీజీపీ కార్యాలయం ముట్టడికి పరుగులు తీశారు. dgp

ఏమిటీ ఈ జీవో 46…

జీవో నెంబర్‌ 46 (GO 46)తో హైదరాబాద్‌ చెందిన అభ్యర్థులకు కు 53 శాతం రిజర్వేషన్‌.. మిగతా ప్రాంతాల అభ్యర్థులకు 47 శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుంది. దీతో మార్కులు ఎక్కువ వచ్చినా కూడా హైదారాబాద్ యేతర జిల్లాల వాళ్లు తొలి ప్రాధాన్యతలో ఎంపిక కాకపోవచ్చు. దీంతో ఈ జీవో వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోతోందని కానిస్టేబుల్ అభ్యర్థులు చెబుతున్నారు.

మార్కులు సాధించినా ఉపయోగం ఉండదు…

హైదరాబాద్ మినహా తెలంగాణలోని ఇతర గ్రామీణ జిల్లాలలో నివసిస్తూ 130 మార్కులు పైగా సాధిస్తే తప్ప ఉద్యోగం రాని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. అదే హైదరాబాద్ జిల్లాలో 80  మార్కులు వచ్చిన వారికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందంటున్నారు.

గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు అన్యాయం…

జీవో 46 వల్ల గ్రామీణ ప్రాంత యువకులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, గ్రామీణ ప్రాంతాలలో నివాసం ఉంటూ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్ర స్థాయిలో నియమించే కానిస్టేబుల్ ఉద్యోగాలలో అర్హత కోల్పోతారని అంటున్నారు. ఉమ్మడి హైదరాబాదు జిల్లాకి 53% రిజర్వేషన్ కల్పించి మిగతా 26 జిల్లాలకి 47% కేటాయించడం వల్ల ఇతర జిల్లాల గ్రామీణ అభ్యర్థులకి తక్కువ స్థాయిలో ఉద్యోగాలు వస్తాయని ఆందోళన చెందుతున్నారు.

You may also like

Leave a Comment