Telugu News » Dilip Ghosh: దీదీపై అభ్యంతరక వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీపై కేసు..!

Dilip Ghosh: దీదీపై అభ్యంతరక వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీపై కేసు..!

బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ (Dilip Ghosh)పై కేసు నమోదైంది. దీదీపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ దుర్గాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదైనట్లు అధికారులు గురువారం వెల్లడించారు.

by Mano
Dilip Ghosh: Objectionable comments on Didi.. Case against BJP MP..!

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌(West Bengal) సీఎం మమతా బెనర్జీ(CM Mamatha Benerjee) కుటుంబ నేపథ్యాన్ని కించపరిచిన బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ (Dilip Ghosh)పై కేసు నమోదైంది. దీదీపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ దుర్గాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదైనట్లు అధికారులు గురువారం వెల్లడించారు.

Dilip Ghosh: Objectionable comments on Didi.. Case against BJP MP..!

భారత శిక్షాస్మృతిలోని 504, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దిలీప్ ఘోష్ ఏమన్నారంటే.. ‘గోవాకు వెళ్లినప్పుడు నేను గోవా బిడ్డనని చెప్తారు.. త్రిపురలో ఉన్నప్పుడు త్రిపుర పుత్రికనని అంటారు. మొదట దీనిపై ఆమె స్పష్టత ఇవ్వాలి..’ అంటూ ఎద్దేవా చేశారు. బెంగాల్‌కు స్థానిక వ్యక్తే కావాలంటూ టీఎంసీ ఇచ్చిన నినాదానికి గానూ ఆయన ఈ విధంగా స్పందించారు.

అయితే, దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. వెంటనే స్పందించిన టీఎంసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు టీఎంసీ ఫిర్యాదు మేరకు దిలీప్‌ ఘోష్‌కు ఈసీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. తాము పంపిన షోకాజ్‌ నోటీసులకు ఈ నెల 29 సాయంత్రం లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు గౌరవంతో, హుందాగా వ్యవహరించాలని ఈసీ ఈ సందర్భంగా సూచించింది. మేదినీపుర్ సిట్టింగ్ ఎంపీ దిలీప్ ఘోష్ ప్రస్తుతం బీజేపీ బెంగాల్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈసారి బీజేపీ అధిష్టానం ఆయనకు బర్దమాన్-దుర్గాపుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సీటు ఖరారు చేసింది.

You may also like

Leave a Comment