మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR)కు బిగ్ షాక్ తగిలింది. శనివారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ నేతల నుంచి అందిన ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రెండ్రోజుల కిందట కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ..రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM REVANTH REDDY) పలువురు కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద రూ.2500 కోట్లు వసూలు చేసి ఢిల్లీలోని హైకమాండ్ పెద్దలకు పంపించినట్లు కేటీఆర్ ఆరోపించారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రదుమారం రేగింది.ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు ఖండించాయి.
హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో స్థానిక కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద కేటీఆర్‌పై క్రిమినల్ కేసు(CRIMINAL CASE ON KTR) నమోదు చేశారు.
ఇదిలాఉండగా పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలులో శిక్ష అనుభిస్తున్నారు. తాజాగా కేటీఆర్ మీద క్రిమినల్ కేసు నమోదైంది. పార్టీ అగ్రనేతల మీద కేసులు అవుతుండటంతో గులాబీ కేడర్‌కు ఏం చేయాలో తెలియక నిరాశ,నిస్పృహలోకి వెళ్లినట్లు సమాచారం.