Telugu News » Shashank Singh: పొరపాటున తీసుకున్నా.. ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న పంజాబ్ స్టార్..!

Shashank Singh: పొరపాటున తీసుకున్నా.. ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న పంజాబ్ స్టార్..!

పంజాబ్ కింగ్స్(Panjab Kings) యాజమాన్యం చేసిన ఓ చిన్న తప్పిదం ఇప్పుడు బాగా కలిసి వచ్చింది. ఐపీఎల్ 2024 వేలంలో ఒకే పేరుతో ఇద్దరు ఆటగాళ్లు ఉండటంతో.. పంజాబ్ సహయజమాని ప్రీతి జింటా పొరపడ్డారు.

by Mano
Shashank Singh: Even if taken by mistake.. Punjab star who is showing his power in IPL..!

ఐపీఎల్‌(IPL-2024)లో పలు ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు వెచ్చించి స్టార్ క్రికెటర్లను కొనుగోలు చేస్తారనే విషయం తెలిసిందే. 2024-ఐపీఎల్‌ ప్రారంభమైన వేళ ఆయా జట్లకు ముందుగానే వేలంవేసి స్టార్ క్రికెటర్లను కొనుగోలు చేశారు. అయితే, పంజాబ్ కింగ్స్(Panjab Kings) యాజమాన్యం చేసిన ఓ చిన్న తప్పిదం ఇప్పుడు బాగా కలిసి వచ్చింది. ఐపీఎల్ 2024 వేలంలో ఒకే పేరుతో ఇద్దరు ఆటగాళ్లు ఉండటంతో.. పంజాబ్ సహయజమాని ప్రీతి జింటా పొరపడ్డారు.

Shashank Singh: Even if taken by mistake.. Punjab star who is showing his power in IPL..!

19 ఏళ్ల బ్యాటర్‌కు బదులుగా ఛత్తీస్‌గడ్‌కు చెందిన శశాంక్‌సింగ్‌(Shashank Singh)ను రూ.20లక్షలకు కొనుగోలు చేశారు. శశాంక్‌ను సొంతం చేసుకున్న అనంతరం పంజాబ్ మేనేజ్‌మెంట్ తమ పొరపాటును గ్రహించింది. అయితే పరువు పోకుండా శశాంక్ తమ టార్గెట్ లిస్ట్‌లో ఉన్నాడని కవర్ చేసింది. వేలం సమయంలో ప్రీతి జింటా పొరపాటు చేసినా.. ఇప్పుడు అదే ఆ జట్టుకు వరంలా మారింది. వద్దనుకున్న శశాంక్ సింగే.. రెండు మ్యాచుల్లో చెలరేగాడు.

ఐపీఎల్ 2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ భారీ స్కోర్ చేసేందుకు శశాంక్ సాయపడ్డాడు. ఆర్సీబీ పేసర్ అల్ట్రారీ జోసెఫ్ వేసిన చివరి ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ బౌండరీ బాది 20 పరుగులు రాబట్టాడు. శశాంక్ హిట్టింగ్‌తో పంజాబ్ పోరాడే స్కోర్ చేసింది. తాజాగా గుజరాత్ టైటాన్స్‌పై సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.

ఐపీఎల్‌లో భాగంగా గురువారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 200 పరుగుల ఛేదనలో శిఖర్ ధావన్ (1), సామ్ కరణ్ (5), సికిందర్ రజా (15) వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు విఫలమైన చోట శశాంక్ సింగ్ సత్తాచాటాడు.

పంజాబ్ కింగ్స్‌కు ఓటమి తప్పదనుకున్న వేళ శశాంక్ విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన పంజాబ్‌ను శశాంక్ ఆదుకున్నాడు. ఓ వైపు వికెట్స్ పడుతున్నా.. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడి పంజాబ్‌కు ఊహించని విజయాన్ని అందించాడు.

పంజాబ్ హీరో అయిన శశాంక్ సింగ్ 1991 నవంబర్ 21న ముంబైలో జన్మించాడు. ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఛత్తీస్‌గడ్ తరఫున ఆడుతున్నాడు. ఇప్పటివరకు 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఆడిన శశాంక్.. 1072 పరుగులు చేశాడు. అంతకుముందు 2015-16 విజయ్ హజారే ట్రోఫీలో లిస్ట్-ఏ క్రికెట్‌లో ముంబై తరఫున అరంగేట్రం చేశాడు. లిస్ట్-ఏ కెరీర్‌లో 30 మ్యాచ్‌లు ఆడి 275 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరలో మెరుపులు మెరిపించడం శశాంక్ ప్రత్యేకత. ఇప్పటివరకు 58 టీ20లు ఆడి 754 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 60 వికెట్లు కూడా పడగొట్టాడు.

You may also like

Leave a Comment