పెళ్లి(Marriage) అంటే ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. హల్దీ ఫంక్షన్ మొదలుకుని ఆ సందడి షురూ అవుతుంది. ఇక భాజా భజంత్రీలు, కళకళలాడే పెళ్లి పందిరి, విందు భోజనాల నడుమ అందరూ ఫుల్ జోష్‌లో కనిపిస్తారు. ఈ నేపథ్యంలో పెళ్లి వేడుకలో వరుడిని ఎదుర్కోవడానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్లాన్ చేసుకుంటారు.
కొందరు ఈ మధ్య గుర్రంపై వరుడుని ఎదుర్కొంటారు. మరికొందరు కారుకు పూలను అందంగా డెకరేట్ చేస్తుంటారు. అయితే, తాజాగా ఓ పెళ్లి కార్యక్రమంలో పెళ్ళికొడుకు కార్ డెకరేషన్ కాస్త డిఫరెంట్‌గా చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ వీడియో వైరల్(Viral Video) అవుతోంది. ఆ వీడియోను పరిశీలిస్తే.. పెళ్ళికొడుకు ఓ కారులో పెళ్లి మండపానికి చేరుకుంటాడు.
కాకపోతే ఆ పెళ్ళికొడుకు వచ్చిన కార్‌ను చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. దీనికి కారణం ఆ కారును పూర్తిగా చిప్స్ ప్యాకెట్లు, కురుకురే ప్యాకెట్లతో డెకరేట్ చేశారు. పెళ్లికొడుకు పెళ్లి మండపానికి చేరుకోగానే అతనిని రిసీవ్ చేసుకోవడానికి అతని చుట్టూ అందరూ చేరి స్వాగతం పలికారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
దీంతో నెటిజెన్స్ వారి స్టైల్స్‌లో కామెంట్ చేస్తున్నారు. ఇందులో కొందరైతే.. పెళ్ళికొడుకుది కిరణ షాపు కావచ్చని అంటుంటే మరికొందరు బయట పూలకు పెట్టే ఖర్చు తగ్గించుకుని కురుకునే ప్యాకెట్లతో మేనేజ్ చేశాడని అంటున్నారు. ఇంకొందరేమో వధూవరులు ఇద్దరికీ చిప్స్ అంటే బాగా ఇష్టమేమో అని ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.