Telugu News » Congress Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ఈసారి 25 గ్యారంటీలు..!!

Congress Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ఈసారి 25 గ్యారంటీలు..!!

ఢిల్లీ(Delhi)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘న్యాయ్ పత్ర-2024’(Nyay Patra-2024) పేరుతో ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విడుదల చేశారు. ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీలు’ అంటూ మేనిఫెస్టోకు కాంగ్రెస్ పేరు పెట్టింది.

by Mano
Congress Manifesto: Congress Manifesto Released.. This Time 25 Guarantees..!!

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో(Congress Manifesto)ను ఇవాళ(శుక్రవారం) విడుదల చేసింది. ఢిల్లీ(Delhi)లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘న్యాయ్ పత్ర-2024’(Nyay Patra-2024) పేరుతో ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విడుదల చేశారు. ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీలు’ అంటూ మేనిఫెస్టోకు కాంగ్రెస్ పేరు పెట్టింది.

Congress Manifesto: Congress Manifesto Released.. This Time 25 Guarantees..!!

 

ఇందులో 48 పేజీలలో కాంగ్రెస్ మేనిఫెస్టోను పొందుపర్చింది. ప్రధానంగా ఐదు వర్గాలకు న్యాయం చేసేలా 25 గ్యారంటీలను పొందుపరిచారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా పెట్రోల్, డిజీల్ ధరల తగ్గింపు, వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు, దేశవ్యాప్తంగా కుల గణన కనీస మద్దతు ధరకు లీగల్ గ్యారంటీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా రైల్వే ప్రైవేటీకరణ నిలిపివేత, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు, అగ్నివీర్ స్కీమ్ రద్దు, యువతకు 30 లక్షల ఉద్యోగాల కల్పన, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, మహాలక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబాలకు ఏడాదికి రూ.లక్ష నగదు సాయం చేయనున్నట్లు ప్రకటించారు.

కులగణన తర్వాత రిజర్వేషన్ల పరిమితి పెంపునకు రాజ్యాంగ సవరణ చేయనున్నట్లు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచారు. అదేవిధంగా ఎలక్టోరల్ బాండ్స్ మీద ఎంక్వెరీ, కనీస మద్దతు ధర చట్టం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు రూ.లక్ష ఆర్థిక సాయంతో పాటు రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ పెగాసెస్, రాఫెల్‌పై విచారణ చేపట్టనున్నట్లు హామీ ఇస్తూ మేనిఫెస్టోలో 25గ్యారంటీలను విడుదల చేశారు.

You may also like

Leave a Comment