సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ (BJP)ని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమి (India Alliance) ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే గత కొద్ది రోజుల క్రితం ఈ కూటమిలో కాస్త లుకలుకలు ఏర్పడ్డాయి.. కానీ ప్రస్తుతం అంతా సద్దుమని అయ్యిందని నేతలు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించారు.. ఇందులో భాగంగా కాంగ్రెస్ (Congress) తన మేనిఫెస్టోను విడుదల చేసింది.

మరోవైపు సైద్ధాంతిక ఎన్నికల్లో పోరాడుతోన్న ఇండియా కూటమి.. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో తాము విజయం సాధిస్తామనే నమ్మకం ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా బీజేపీ చేతిలో సీబీఐ, ఈడీ, ఐటీ ఉన్నాయని ఆరోపించిన రాహుల్.. న్యాయం తమవైపు ఉన్నట్లు వెల్లడించారు.. కాబట్టి ప్రజలు నిజాన్ని గ్రహించి తీర్పును ఇవ్వాలని పిలుపునిచ్చారు..
నువ్వానేనా అనేలా సాగుతున్న ఎన్నికల్లో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి.. వాటిని పరిరక్షించేందుకు ప్రయత్నిస్తున్న వారికి మధ్య జరుగుతున్నాయని రాహుల్ అన్నారు.. బీజేపీకి దీటైన పోటీనిచ్చి విజయం సాధిస్తాం అనే ధీమా వ్యక్తం చేశారు.