Balasore Train Accident CBI Charge Sheet: బాలాసోర్ రైలు ప్రమాద నిందితులపై CBI ఛార్జ్‌షీట్
ఒడిశాలోని బాలాసోర్ (Balasore) వద్ద జూన్ 2న దాదాపు 291 మంది మృతికి కారణమైన ప్రమాదానికి సంబంధించి సీబీఐ (CBI) ముగ్గురు రైల్వే అధికారులపై చార్జ్ షీట్ ముగ్గురు రైల్వే అధికారులపై (Charge Sheet) దాఖలు చేసింది.
అరెస్టయిన వారిలో బాలాసోర్‌లో సీనియర్ సెక్షనల్ ఇంజనీర్ పనిచేసిన అరుణ్ కుమార్ మహంత, సెక్షనల్ ఇంజనీర్ మహమ్మద్ అమీర్ ఖాన్ టెక్నిషియన్ పప్పు కుమార్ ఉన్నారు. వీరిపై హత్యానేరంతో పాటు సాక్ష్యాల ధ్వంసం వంటి నేరాభియోగాలను మోపింది.
ప్రమాదం అనంతరం ముగ్గురు అధికారులు ఈ ప్రమాదంలో తమ పాత్ర లేదని చెప్పేందుకు, అక్కడున్న సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని సీబీఐ ఛార్జ్ షీట్ లో ఆరోపించింది.
బాహానగా బజార్ స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగిన 94వ లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద మరమ్మతు పనులు మహంత సమక్షంలోనే జరిగాయి. అయితే, ఈ పనులకు 79వ లెవల్ క్రాసింగ్ గేట్‌కు సంబంధించిన రేఖాచిత్రాన్నే ఉపయోగించారని సీబీఐ పేర్కొంది. ఇప్పటికే ఉన్న సిగ్నల్, ఇంటర్ లాకింగ్ వ్యవస్థలను పరీక్షించడం, మరమ్మతులు చేపట్టడం, మార్పులు చేయడం తోపాటు ఆమోదిత ప్రణాళిక, సూచనలకు అనుగుణంగా ఉన్నయా, లేదా అనేది నిర్ధారించుకోవడం మహంత పని అని…అయితే, ఆయన దీన్ని విస్మరించారని సీబీఐ పేర్కొంది.
ఇటీవల మహంత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగానూ సీబీఐ ఇదే వాదన వినిపించింది. దీంతో కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. ఈ ఏడాది జులై 2న బాలసోర్ జిల్లాలోని బాహానగా బజార్ స్టేషన్ వద్ద…లూప్‌లైన్‌లో ఆగివున్న గూడ్స్ రైలును షాలీమార్-చెన్నై కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
అనుమతులు లేని మరమ్మతులు చేపట్టడమే ఈ ప్రమాదానికి కారణమని సీబీఐ ఇప్పటికే పేర్కొంది. తాజాగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ ముగ్గురు ఉద్యోగులపై నేరాభియోగాలు మోపింది.