Telugu News » AP High Court Sensational Judgment: పోలీస్ శాఖలో ఆ ఉద్యోగి తొలగింపు తప్పులేదు…ఏపీ హైకోర్ట్

AP High Court Sensational Judgment: పోలీస్ శాఖలో ఆ ఉద్యోగి తొలగింపు తప్పులేదు…ఏపీ హైకోర్ట్

మహిళ జూనియర్ అసిస్టెంట్ తో లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయన్ని విచారించిన ఉన్నతాధికారులు.. సర్వీసు నుంచి తొలగిస్తూ 2013 డిసెంబర్ 26న ఉత్తర్వులు జారీ చేశారు.

by Prasanna
Police Kurnool

కర్నూలో సహచర మహిళ పోలీసు ఉద్యోగి (Police)ని ఆత్మగౌరవానికి భంగం కలిగేలా లైంగిక వేధింపులకు (Sexual Harrasement) పాల్పడ్డారని కర్నూలు ఏపీపీఎస్పీ (APPSP) రెండో బెటాలియన్ జూనియర్ అసిస్టెంట్ సి. గోవిందరాజును సర్వీసు నుంచి తొలగించడాన్ని హైకోర్ట్  (High Court)సమర్ధించింది. ఉద్యోగం నుంచి తొలగిండం తీవ్ర శిక్ష అనే పిటిషినర్ వాదనను తోసిపుచ్చింది. గోవిందరాజులపై అభియోగం నిరూపణ అయినందున సర్వీసు నుంచి తొలగించడాన్ని హైకోర్టు సమర్థిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

Police Kurnool

కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్ లో సి. గోవిందరాజులు 1994 ఆగస్టు 17న జూనియర్ అసిస్టెంట్ గా నియమితులయ్యారు. 2013 మే 10న ఓ మహిళ జూనియర్ అసిస్టెంట్ తో లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయన్ని విచారించిన ఉన్నతాధికారులు.. సర్వీసు నుంచి తొలగిస్తూ 2013 డిసెంబర్ 26న ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ విషయంపై గోవిందరాజులు ఏపీఎస్పీలో అప్పీల్ చేయగా…డీఐజీ తిరస్కరిస్తూ 2014 ఆగస్టు 25న ఉత్తర్వులిచ్చారు. తనను సర్వీసు నుంచి తొలగించడం, అప్పీలును తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ.. గోవిందరాజులు ఏపీఏటీని ఆశ్రయించారు. ఆయన పిటిషన్ను కొట్టేస్తూ.. 2017 సెప్టెంబర్ 15 ఏపీఏటీ తీర్పు ఇచ్చింది. దాంతో ఆ తీర్పును సవాలు చేస్తూ.. గోవిందరాజులు అదే ఏడాది హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలోనే  గోవిందరాజులు వేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపుల నుంచి మహిళ ఉద్యోగులను రక్షించేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని గుర్తు చేస్తూ… సుప్రీంకోర్టు ఓ కేసులో ‘విశాఖ మారదర్శకాలు’ రూపొందించిందని తెలిపింది. గోవిందరాజులపై ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొంది.

అనంతరంగోవిందరాజులు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తూ ఈ తీర్పు ఇచ్చింది.

You may also like

Leave a Comment