Telugu News » Ice Cafe: 14వేల అడుగుల ఎత్తులో ఐస్ కాఫీ కేఫ్.. వీడియో వైరల్..!

Ice Cafe: 14వేల అడుగుల ఎత్తులో ఐస్ కాఫీ కేఫ్.. వీడియో వైరల్..!

వేసవి(Summer) వచ్చిందంటే చాలా మంది ఎక్కడికైనా పర్యటనకు వెళ్లాలనుకుంటారు. ఎక్కువగా చల్లని ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. విదేశాలకు వెళ్లలేని వారు భారత్‌లోనే ఉన్న సుందరమైన ప్రదేశాలకు వెళ్తారు. అలాంటి వారికి ఓ అద్భుతమైన నిర్మాణం సిద్ధమైంది. సముద్ర మట్టానికి ఏకంగా 14వేల అడుగుల ఎత్తులో నిర్మించిన ఐస్ కేఫ్(Ice Cafe) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

by Mano
Ice Cafe: Ice coffee cafe at a height of 14 thousand feet.. Video viral..!

వేసవి(Summer) వచ్చిందంటే చాలా మంది ఎక్కడికైనా పర్యటనకు వెళ్లాలనుకుంటారు. ఎక్కువగా చల్లని ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. విదేశాలకు వెళ్లలేని వారు భారత్‌లోనే ఉన్న సుందరమైన ప్రదేశాలకు వెళ్తారు. గోవా(Goa), లడక్(Ladak) వంటి ప్రాంతాలకు ఈ సమ్మర్‌లో వెకేషన్ ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికి ఓ అద్భుతమైన నిర్మాణం సిద్ధమైంది.

Ice Cafe: Ice coffee cafe at a height of 14 thousand feet.. Video viral..!

భారత్‌(Bharath) లోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటైన లడక్‌లో అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. సముద్ర మట్టానికి ఏకంగా 14వేల అడుగుల ఎత్తులో నిర్మించిన ఐస్ కేఫ్(Ice Cafe) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కేఫ్ ఇప్పుడు భారత్‌లో మొట్టమొదటిగా నిలిచింది. పర్యటకుల తాకిడి ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఐస్ కేఫ్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇటీవలే అద్భుతమైన దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ కేఫ్‌లో సంప్రదాయ నూడుల్స్, వివిధ రకాల వేడి పానీయాలు అందిస్తున్నారు. పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్న ఈ కేఫ్ ఇంతకుముందు కనీవినీ ఎరుగని రీతిలో నిర్మించారు. పర్యాటకులు ఈ కేఫ్‌ను సందర్శించిన తర్వాత మంచి అనుభూతిని పొందుతారు.

కృత్రిమ, సహజమైన మంచు గడ్డలతో తయారు చేయగా ఇది కరిగిపోకుండా ఉండడానికి ప్రత్యేకమైన చర్యలను తీసుకున్నారు. ఈ కృత్రిమ, సహజమైన హిమానీనదం మంచు గడ్డలతో తయారు చేశారు. ఈ మంచు గడ్డలు కరిగిపోకుండా ఉండడానికి ప్రత్యేకమైన చర్యలను తీసుకున్నట్లు కేఫ్ నిర్వాహకులు తెలిపారు.

You may also like

Leave a Comment