రాష్ట్రంలోని పొద్దు తిరుగుడు(Sunflower Crop) రైతులకు న్యాయం చేయాలని, వారు పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish rao) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Cm Revanth reddy)ని కోరారు. ఈ మేరకు సోమవారం సీఎంకు హరీశ్ రావు లేఖ రాసినట్లు సమాచారం.
తెలంగాణలో ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని 20,829 ఎకరాల్లో రైతులు పొద్దు తిరుగుడు పువ్వు పంటను పండించారని, దీనికి మార్కెట్లో కనీస మద్దతు ధర లిభించడం లేదన్నారు.ఇదే విషయమై ఫిబ్రవరి 22న ప్రభుత్వానికి లేఖ రాయగా.. వ్యయసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పందిస్తూ మద్దతు ధర 6,760 చెల్లించి పొద్దు తిరుగుడును కొనుగోలు చేస్తామని చెప్పినట్లు లేఖలో ప్రస్తావించారు.
అయితే, రైతులు తీసుకొచ్చిన మొత్తం పంటలను రాష్ట్రం ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని, కేంద్రం ప్రభుత్వం వాటాను మాత్రమే సేకరించాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తప్పుబట్టారు. ఇలా చేస్తే 75శాతం పంటను రైతులు నష్టపోవాల్సి వస్తుందని సీఎంకు లేఖ ద్వారా వివరించారు.
రాష్ట్రంలో 1,65,800 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు పంట దిగుబడి అయితే, కేంద్రం తన వాటాగా 37,300 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుందన్నారు. కావున మిగతా పంటకు రాష్ట్ర సర్కార్ కనీసమద్దతు ధర రూ.6,760 చెల్లించి మిగతా పంటను కొనుగోలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.