లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) దగ్గరపడుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ (Rajiv Kumar)కు కేంద్ర ప్రభుత్వం సాయిధ కమెండోలతో జడ్-కేటగిరి (Z-category) భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పించింది.
ఎన్నికల నేపథ్యంలో సీఈసీకి ముప్పు పొంచి ఉందంటూ కేంద్ర భద్రతా సంస్థల నివేదిక ఆధారంగా కేంద్ర హోం శాఖ తాజా భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. దీంతో ఇక నిరంతరం ఆయన వెంట ఆరుగురు గన్ మెన్లు, ఇంటి వద్ద ఇద్దరు సిబ్బంది సెక్యురిటీగా ఉండనన్నారు.
జడ్’ కేటగిరి భద్రత కింద సెంట్రల్ రిజర్స్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన 40 నుంచి 45 మంది సిబ్బంది సీఈసీ రక్షణ విధుల్లో ఉంటారు. దేశ వ్యాప్తంగా ఆయన ఎక్కడ పర్యటించినా ఆయన వెంటే వెళ్తారు. 1984 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన కుమార్ 2022 మే 15వ తేదీన భారతదేశ 25 ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ప్రస్తుతం 18వ లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో బిజీ అయ్యారు. ఏప్రిల్ 19వ తేదీతో మొదలై 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగునుంది. ఈ నేపథ్యంలో ఆయనకు పూర్తిస్థాయి భద్రతను కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఆయనకు జడ్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది.