హైదరాబాద్ మహానగరంలో మాదక ద్రవ్యాల(InToxicants) వినియోగం క్రమంగా రాజ్యమేలుతోంది. కొందరు అక్రమార్కులు డబ్బుల కోసం గుట్టుగా మాదకద్రవ్యాలను తీసుకొచ్చి నగరంలోని పబ్బులు, హోటల్స్, బస్టాండ్స్, రైల్వే స్టేషన్లలో విక్రయిస్తున్న ఘటనలు ఇప్పటికే పలుమార్లు వెలుగుచూశాయి.
గతంలో సినిమా పరిశ్రమలో కూడా మత్తు పదార్థాలు తీసుకుని అనేక మంది సెలబ్రిటీలు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. గత బీఆర్ఎస్(BRS) సర్కారు హయాంలో మాదక ద్రవ్యాల ముఠా విచ్చలవిడిగా నగరంలోనికి పెద్దమొత్తంలో మత్తుపదార్థాలను తీసుకొచ్చి విక్రయించినట్లు ఇన్వెస్టిగేషన్ అధికారులు పేర్కొన్నారు.
కాలేజీ స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలు, యువత పెద్ద ఎత్తున మత్తుకు బానిస అయినట్లు అధికారుల వద్ద సమాచారం ఉన్నది. కానీ, ప్రభుత్వంలోని కొందరు పెద్దల ఆదేశాలతో వారంతా సైలెంట్‌గా ఉండిపోయారని అప్పట్లో కథనాలొచ్చాయి.
ఇక్కడ షాకింగ్ విశేషం ఏమిటంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే జైళ్లలోనూ మత్తు పదార్థాల వాడకం జరుగుతున్నట్లు తాజాగా వెల్లడైంది. తాజాగా హైదరాబాద్ లోని చర్లపల్లి జైలు(charlapalli jail)లో సంచలన నిజాలు బయటపడ్డాయి. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన కొందరు ఖైదీలు శనివారం ఉదయం జైలు సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. దీంతో జైలు ఉన్నతాధికారులు నలుగురు ఖైదీలను బంధించి ప్రత్యేక బ్యారాక్లోని తరలించినట్లు తెలిసింది.