Telugu News » Rishabh Pant: రికార్డు సృష్టించిన పంత్​.. ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర..!

Rishabh Pant: రికార్డు సృష్టించిన పంత్​.. ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర..!

ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు పంత్. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ రెండు రికార్డులను కైవసం చేసుకున్నాడు.  

by Mano
Delhi Capitals: My mistake.. Rishabh Pant on Delhi's defeat..!

కారు ప్రమాదం తర్వాత దాదాపు 16నెలల పాటు విశ్రాంతి తీసుకుని రికవర్ అయిన క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant) ఐపీఎల్‌(IPL)తో మైదానంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు పంత్. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ రెండు రికార్డులను కైవసం చేసుకున్నాడు.

Rishabh Pant: Pant who created a record.. a new history in IPL..!

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున 3వేల పరుగుల మార్కును అందుకుని చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్ లక్నోపై ఈ ఘనతను సాధించాడు. రిషబ్ పంత్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 104 మ్యాచ్‌ల్లో 34 సగటుతో 3032 పరుగులు చేశాడు. దీంతోపాటు మూడు వేల పరుగులను అతి తక్కువ బంతుల్లో సాధించిన బ్యాటరుగా కూడా రిషబ్ పంత్ రికార్డుల ఎక్కాడు. ఈ ఘనతను రిషబ్ పంత్ 2028 బంతుల్లో పూర్తి చేశాడు.

ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో ఆరు మ్యాచ్ లలో 194 పరుగులు చేసి జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు అర్ధ శతకాలు సాధించగా ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్థానంలో ఉన్నాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండ్ షో తో లక్నో సూపర్ జయింట్స్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.

ముఖ్యంగా హ్యాట్రిక్ ఓటముల నుంచి తప్పించుకొని ఢిల్లీ విజయాన్ని కైవసం చేసుకుంది. మొదటగా బ్యాటింగ్ చేసిన లక్నో 167 పరుగులు చేయగా.. దానిని ఢిల్లీ క్యాపిటల్స్ ఛేదనలో 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ 24 బంతుల్లో 41 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఇక 3వేల పరుగుల మర్క్‌ను పంత్‌ తర్వాత డేవిడ్‌ వార్నర్‌ 2, 549, శ్రేయస్స్ అయ్యర్‌ 2,375, వీరేంద్ర సెహ్వాగ్‌ 2, 174, శిఖర్‌ ధావన్‌ 2,066 పరుగులతో ఉన్నారు.

ఈ సందర్భంగా పంత్ మాట్లాడుతూ.. మా జట్టు సభ్యులకు ఛాంపియన్లుగా ఆలోచించాలని, కష్టపడి పోరాడాలని సూచించాను. మైదానంలో కొన్ని సవాళ్లను అధిగమించలేకపోయాం. జట్టులో చాలా మంది ఆటగాళ్లు గాయపడటమే ఇందుకు కారణం. ఈ సమస్య అన్ని జట్లలోనూ ఉంది. మనం దీనిని ఒక సాకుగా చూపవచ్చు. దీని నుంచి చాలా నేర్చుకున్నా” అని పంత్‌ అన్నాడు.

You may also like

Leave a Comment