తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Cm Revanth Reddy) మాదిగ సంఘాల ఫ్రంట్ నేతలు శనివారం ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం సీఎంతో సమావేశం అయ్యి మాదిగ కార్పొరేషన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేయడంతో పాటు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు.
మాదిగ సామాజిక వర్గానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. అయితే, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేవలం అగ్రకులాల వారికే ఎంపీ సీట్లను కేటాయించిందని అపవాదు ఉన్నది.
ఇటీవల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ (MRPS FOUNDER MANDAKRISHNA MADIGA) సైతం కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు విషయంలో సీరియస్ అయ్యారు. మాదిగలకు ఎంపీ సీట్ల కేటాయింపు విషయంలో అన్యాయం జరిగిందన్నారు. మాలలకు మాత్రం 3 సీట్లు ఇచ్చి మాదిగలను కించపరుస్తారా? అని ప్రశ్నించారు.
అంతేకాకుండా మాదిగలను విస్మరించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎంపీ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని మందకృష్ణ మాదిక పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తన మద్దతును బీజేపీకి ఇచ్చారు. ఈ క్రమంలోనే మాదిగల ఓట్లు ఎక్కడ దూరం అవుతాయో అని భావించిన సీఎం రేవంత్ రెడ్డి మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారని పలువురు విమర్శిస్తున్నారు.కాగా, రేవంత్ మాటలు నీటి మూటలేలనని కొందరు ఎమ్మార్పీఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. కాగా, మందకృష్ణ మాత్రం కాంగ్రెస్ వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం.