Telugu News » Sonu Sood: డెలివరీ బాయ్‌కి సోనూసూద్ మద్దతు… నెటిజన్ల ఆగ్రహం..!

Sonu Sood: డెలివరీ బాయ్‌కి సోనూసూద్ మద్దతు… నెటిజన్ల ఆగ్రహం..!

ప్రముఖ నటుడు సోనూసూద్ (Sonu Sood) ఓ ఇంటి ముందు షూ దొంగలించిన స్విగ్గీ డెలివరీ(Swiggy Delivery) బాయ్‌కి (ఎక్స్) వేదికగా తన మద్దతు ప్రకటించాడు. ఫుడ్‌డెలివరీ సమయంలో ఏదైనా ఇంటి ముందు షూ చోరీ చేస్తే అతడిపై చర్యలు తీసుకోవద్దన్నాడు. అయితే, దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

by Mano
Sonu Sood: Sonu Sood's support for delivery boy... Netizens' anger..!

ప్రముఖ నటుడు సోనూసూద్ (Sonu Sood) ఓ ఇంటి ముందు షూ దొంగలించిన స్విగ్గీ డెలివరీ(Swiggy Delivery) బాయ్‌కి (ఎక్స్) వేదికగా తన మద్దతు ప్రకటించాడు. ఫుడ్‌డెలివరీ సమయంలో ఏదైనా ఇంటి ముందు షూ చోరీ చేస్తే అతడిపై చర్యలు తీసుకోవద్దన్నాడు. అందుకు బదులుగా కొత్త షూ కొనివ్వాలన్నాడు. అతడికి అవి అవసరం కావొచ్చు, తోటివారి పట్ల దయగా ఉండాలని సూచించాడు. అయితే, దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Sonu Sood: Sonu Sood's support for delivery boy... Netizens' anger..!

 

కాగా, ఇటీవల గురుగ్రామ్‌లో ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ కస్టమర్ ఇంటికి డెలివరీ చేయడానికి వెళ్లి షూ దొంగిలించడం సీసీ కెమెరాలో చిక్కింది. అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై సోనూసూద్ స్పందిస్తూ.. స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరాడు. అది అవసరం కాబట్టే తీసుకుని ఉండవచ్చన్నాడు. తద్వారా మానవత్వం వర్ధిల్లుతుందన్నాడు.

అయితే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే సోనూసూద్ డెలివరీ బాయ్‌కి మద్దతుగా (ఎక్స్)లో పెట్టిన పోస్టు ఇప్పుడు ఆయన ట్రోల్స్‌ను ఎదుర్కొనేలా చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో సోనూసూద్ పోస్టుపై నెటిజన్ల నుంచి వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోనూసూద్ వైఖరికి కొందరు మద్దతు తెలుపగా.. మరో వర్గం వ్యతిరేకిస్తోంది. ఆయన అభిప్రాయం తప్పని నిరసన తెలుపుతున్న వారు దొంగతనాన్ని సమర్థించడం ఎంతవరకు సరైనదని ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే భారతదేశంలోని లక్షలాది మంది ప్రజలు స్విగ్గీ డెలివరీ బాయ్ కంటే పేదలున్నారని నెటిజన్లు అంటున్నారు. ఈ చోరీ ఘటనపై ప్రజలు తీవ్రస్థాయిలో చర్చించుకుంటున్నారు. సోనూసూద్ ట్వీట్ తర్వాత చాలా మంది వినియోగదారులు ఆయనను ట్రోల్ చేయడం ప్రారంభించారు. డెలివరీ బాయ్ పేదరికంలో ఉండొచ్చు కానీ దొంగతనం నేరం.. చైన్ స్నాచర్ మీ బంగారు గొలుసును దొంగిలించినట్లయితే.. అతనిపై చర్య తీసుకోరా అంటూ వినియోగదారులు సోనూసూద్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment