లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ(BJP) అధిష్టానం ఇవాళ(ఆదివారం) పార్టీ మేనిఫెస్టోను(BJP Manifesto) విడుదల చేసింది. ‘ సంకల్ప పత్రం-2024’ (Sankalp Patra 2024) పేరుతో ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ రిలీజ్ చేశారు.
రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది బృందం మేనిఫెస్టోను రూపొందించింది. 14 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా, అధునాతన దేశంగా భారత్ అవతరించేందుకు మోదీ(PM Modi) సారథ్యంలో మేనిఫెస్టోను రూపొందించారు. బీజేపీ అనుసరించబోయే విధానాలను అందులో పొందుపరిచారు.
ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం పురోగమిస్తోందన్నారు. సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్ పోరాడారని, దేశాభివృద్ధే లక్ష్యమని చెప్పారు. వచ్చే ఐదేళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో తమ మేనిఫెస్టోలో తెలుస్తుందని స్పష్టం చేశారు. తాము ఏం చెప్పామో అది చేసి చూపించామని, చెప్పుకొచ్చారు.
మేనిఫెస్టోతో పాటు పదేళ్లలో బీజేపీ సాధించిన విజయాలపై ఓ కరపత్రాన్ని విడుదల చేశారు. త్రిపుల్ తలాక్, రద్దు, ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం, నాలుగు కోట్ల పక్కా ఇళ్లు, మహిళలకు చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్లు, విమానాశ్రయాల సంఖ్య 74నుంచి 149కి పెంపు, 20నగరాల్లో మెట్రో సేవల విస్తరణ, పీఎం ఉజ్వల యోజన కింద 10కోట్ల గ్యాస్ కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ ద్వారా 37కోట్ల మందికి లబ్ధి తదితర వాటిని అందులో పేర్కొన్నారు.
#WATCH | Bharatiya Janata Party (BJP) releases its election manifesto – 'Sankalp Patra' for the ensuing Lok Sabha polls in the presence of Prime Minister Narendra Modi, Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh and party President JP Nadda.#LokSabhaElection pic.twitter.com/WVB8Km1NWJ
— ANI (@ANI) April 14, 2024