పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) హోరా హోరీగా తలపడుతున్నాయి.. ఈ ఎన్నికలను రెండు నేషనల్ పార్టీలు కీలకంగా భావించిన తరుణంలో ఆరోపణలతో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం కనిపిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) బీజేపీపై ట్విట్టర్ (X) వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

అదేవిధంగా బీజేపీ అగ్రనేతలు మొదట ప్రజల ముందు రాజ్యాంగంపై ప్రమాణం చేస్తారు.. కానీ రాత్రికి రాత్రే రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు స్క్రిప్ట్ రాస్తారని విమర్శలు గుప్పించారు.. అలాగే పూర్తి అధికారం దక్కిన తర్వాత రాజ్యాంగంపై దాడి చేస్తారని ఎక్స్ వేదికగా ప్రియాంక ఆరోపించారు.. మరోవైపు బాబా సాహెబ్ రాజ్యాంగం భారతదేశానికి ఆత్మలాంటిదని పేర్కొన్న ఆమె.. దేశంలో కోట్లాది మందికి గౌరవ ప్రదంగా జీవించే హక్కును కల్పించిందని తెలిపారు..
సామాన్య ప్రజలను రాజ్యాంగం ప్రజాస్వామ్యంలో కేంద్రంగా ఉంచిందన్న ప్రియాంక.. ఈరోజు మనమందరం ఏకమై బీజేపీ ‘చేంజ్ ది కాన్స్టిట్యూషన్ మిషన్’ని తిరస్కరించాలని పిలుపునిచ్చారు.. అలాగే దేశం రాజ్యాంగం ద్వారా నడుస్తుందని, రాజ్యాంగాన్ని మార్చాలని భావించేవారిని మనమంతా కలిసి ఓడిస్తామని సూటిగా తెలియచేయాలని పేర్కొన్నారు..