Telugu News » MIM : మేం ఎవరి దగ్గరికి వెళ్లం.. అధికార పార్టీలే మాదగ్గరకు వస్తాయి : అక్బరుద్దీన్ ఓవైసీ!

MIM : మేం ఎవరి దగ్గరికి వెళ్లం.. అధికార పార్టీలే మాదగ్గరకు వస్తాయి : అక్బరుద్దీన్ ఓవైసీ!

సంచలన, వివాదాస్పద కామెంట్స్‌కు కేరాఫ్ చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్భరుద్దీన్ ఓవైసీ(MLA Akbaruddin owaisi)..ఆయనకు ఎన్నికల టైంలో అప్పుడప్పుడు పూనకం వచ్చినట్లు మాట్లాడుతుంటారు. అవతలి వారు ఏ పార్టీ.. అవతలి వ్యక్తి ఎవరు? అనేది అస్సలు చూడరని, కేవలం ఎన్నికల్లో ఎలా గెలవాలి.ఓ వర్గం ఓట్లను ఎలా పొలరైజ్ చేయాలనేది ఆయనకు బాగా తెలుసని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

by Sai
They are trying to kill our brothers and sisters.. Akbaruddin Owaisi's sensational comments

సంచలన, వివాదాస్పద కామెంట్స్‌కు కేరాఫ్ చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్భరుద్దీన్ ఓవైసీ(MLA Akbaruddin owaisi)..ఆయనకు ఎన్నికల టైంలో అప్పుడప్పుడు పూనకం వచ్చినట్లు మాట్లాడుతుంటారు. అవతలి వారు ఏ పార్టీ.. అవతలి వ్యక్తి ఎవరు? అనేది అస్సలు చూడరని, కేవలం ఎన్నికల్లో ఎలా గెలవాలి.ఓ వర్గం ఓట్లను ఎలా పొలరైజ్ చేయాలనేది ఆయనకు బాగా తెలుసని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

We will not go to anyone.. Only the ruling parties will come to us: Akbaruddin Owaisi!

తన సోదరుడు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కంటే అక్బరుద్దీన్ చాలా డేంజర్ అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. ఎందుకంటే ఆయన తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఓ వర్గం యువత, ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటారని గతంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే.

తాజాగా అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు నేరుగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించినట్లుగా ఉన్నాయి.ఎంఐఎం పార్టీని చాలా మంది కాంగ్రెస్‌కు బీ-టీమ్ అని మాట్లాడుతున్నారని..తాము ఎవరికీ బీ-టీమ్ కాదని.. కాంగ్రెస్ పార్టీ నేతలే తమ వద్దకు వచ్చారన్నారు.

ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీలే తమ వద్దకు వస్తాయని.. మేం ఎవరి వద్దకు వెళ్లమని.. ఎందుకంటే ఎంఐఎం(MIM) బలమైన పార్టీ అని.. ఎవరూ తమను ఓడించలేరని ఎన్నికల ప్రచారంలో భాగంగా వ్యాఖ్యానించారు. కాగా, గతంలో ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్భరుద్దీన్ చేసిన కామెంట్స్ పై అధికార కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

You may also like

Leave a Comment