Telugu News » Heavy Rain in Dubai: దుబాయ్‌లో భారీ వర్షం.. ముంబై వరదలను తలపిస్తున్న రోడ్లు..!

Heavy Rain in Dubai: దుబాయ్‌లో భారీ వర్షం.. ముంబై వరదలను తలపిస్తున్న రోడ్లు..!

యూఏఈలో ఇప్పుడు భారీ వర్షాలు(Heavy Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయంతో నిండిపోతున్నాయి. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్‌లు వరద నీటితో నిండిపోయాయి.

by Mano
Heavy Rain in Dubai: Heavy rain in Dubai.. Mumbai's roads facing floods..!

ఎడాది దేశం దుబాయ్‌(Dubai)లో సాధారణంగా విపరీతమైన ఎండలు ఉంటాయి. అక్కడ వర్షపాతం చాలా తక్కువ. అలాంటిది యూఏఈలో ఇప్పుడు భారీ వర్షాలు(Heavy Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయంతో నిండిపోతున్నాయి. ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్‌లు వరద నీటితో నిండిపోయాయి. కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది.

Heavy Rain in Dubai: Heavy rain in Dubai.. Mumbai's roads facing floods..!

మంగళవారం సాయంత్రం ఒక్క సారిగా ఆకస్మికంగా వర్షాలు కురవడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో దహదారులు నీట మునిగాయి. దుబాయ్ ఎయిర్ పోర్టు(Dubai Airport) సైతం నీటమునగడంతో విమానాలను రద్దు చేశారు. మరికొన్ని విమానాలను దారిమళ్లించారు. ఇందులో భారత్, పాక్, సౌదీ విమానాలున్నాయి. సుమారు 25 నిమిషాల పాటు ఎయిర్ పోర్టులో కార్యకలాపాలు నిలిపివేశారు.

Heavy Rain in Dubai: Heavy rain in Dubai.. Mumbai's roads facing floods..!

దుబాయ్‌లో సుమారు 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అబుదాబి, షార్జాతో సహా పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీగా వరదలు రావడంతో షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్ నీట మునిగాయి. దుబాయ్ మెట్రో స్టేషన్‌లో మోకాళ్లలోతు నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘ఇది ముంబై కాదు.. దుబాయ్’ అని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఓ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు.

Heavy Rain in Dubai: Heavy rain in Dubai.. Mumbai's roads facing floods..!

నైరుతి నుంచి అల్పపీడనం ఏర్పడటమే గల్ఫ్ దేశాల్లో వాతావరణ మార్పునకు ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. గతేడాది కాప్ 28 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన ఒమన్, యూఏఈలు రెండూ గ్లోబల్ వార్మింగ్ వల్ల మరింత వరదలకు దారితీసే అవకాశం ఉందని తెలిపాయి. అటు దుబాయ్ పొరుగు దేశం ఒమన్‌లోనూ మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ఘటనల్లో 18 మంది మృతి చెందగా మరికొందరు గల్లంతయ్యారు.

You may also like

Leave a Comment