సూర్యుడి(SUN)పై అధ్యయనం చేసేందుకు అంతరిక్ష ఆధారిత తొలి భారతీయ మిషన్ ఆదిత్య ఎల్1(AdityaL!) మంగళవారం తెల్లవారుజామున రెండో భూకక్ష పెంపు విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించిందని ఇస్రో తెలిపింది. ఇస్రోకు చెందిన టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ఈ ఆపరేషన్ చేపట్టింది.
బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ నుంచి రెండవ ఎర్త్-బౌండ్ యుక్తి విజయవంతంగా నిర్వహించారు. సూర్యుడి పరిశీలన కోసం ఇస్రో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఆదిత్య-ఎల్ 1 భూమికి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న మొదటి సూర్య-భూమి లాగ్రాంజియన్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్య నుంచి సూర్యుడిని అధ్యయనం చేసిన మొదటి భారతీయ అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీగా నిలిచింది.
సెప్టెంబరు 3వతేదీన భూమిపైకి తొలి విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించారు. 63 నిమిషాల 20 సెకన్లపాటు ప్రయాణించిన తర్వాత ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌకను భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.
సెప్టెంబరు 5 వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆదిత్య ఎల్ 1 రెండో భూకక్ష్య పెంపు విన్యాసాన్ని నిర్వహించిందని ఇస్రో చెప్పింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటరు నుంచి శనివారం ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఈ ఉపగ్రహంలో ఉంచిన 7 పరిశోధన పరికరాలు సూర్యుడి గురించి పరిశోధించనున్నాయి