రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ మిషన్-15 పేరుతో ప్రత్యేక వ్యూహం అమలుచేస్తుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ (Congress) అభ్యర్థుల విజయాన్ని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) జిల్లాల్లో విస్త్తృతంగా ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ వరంగల్ (Warangal) పార్లమెంట్ అభ్యర్థిని కడియం కావ్యకు మద్ధతుగా సీఎం ప్రచారంలో పాల్గొన్నారు..
ఈ సందర్భంగా బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP)పై పలు విమర్శలు గుప్పించారు. మామా అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగిరిపడుతున్నారన్నారు. అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్… నిన్న నాలుగు గంటలు టీవీ స్టుడియోలో కూర్చోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మందేసి గీశాడో.. దిగాక గీసాడోగానీ మొత్తానికి కూలిపోయిందని రేవంత్ ఎద్దేవా చేశారు..
నువు కట్టిన కాళేశ్వరం అద్భుతమైతే చర్చకు రా అని రేవంత్, కేసీఆర్ కు సవాల్ విసిరారు.. హరీష్ రావు… రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని రెడీగా ఉండని పేర్కొన్నారు.. అలాగే పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తెలుస్తానని హెచ్చరించారు.. ఆనాడు పెట్రోల్ పోసుకున్న నీకు అగ్గిపెట్టే దొరకలేదని చెప్పినట్లు కాదని విమర్శించారు. మరోవైపు ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతీ గ్రామానికి నీళ్లు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదన్నారు..
ఇండస్ట్రియల్ కారిడార్ ను నెలకొల్పి నిరుద్యోగ యువకులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తాం.. వరంగల్ లో టెక్స్టైల్స్ పార్కును అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు.. అలాగే ఎయిర్ పోర్టుకు మహర్దశ కల్పిస్తామని పేర్కొన్నారు.. వరంగల్ నగరాన్ని పట్టి పీడిస్తున్న చెత్త సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు.. నేనే స్వయంగా వచ్చి వరంగల్ లో కూర్చుని నగర సమస్యలను పరిష్కరిస్తానని తెలిపిన సీఎం.. కాకతీయ యూనివర్సిటీకి కొత్త వీసీని నియమించి యూనివర్సిటీని ప్రక్షాళన చేస్తామన్నారు..
ఉత్తర తెలంగాణ అంతా వరంగల్ వైపుచూసేలా నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదని పేర్కొన్నారు. మరోవైపు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసి ఆత్మహత్యలు ఆపుతానని మోడీ హామీ ఇచ్చారు..కానీ ఆత్మహత్యలు ఆగలేదు.. రైతుల ఆదాయం పెరగలేదన్నారు. జన్ ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానన్న ప్రధాని మోసం చేశారని ఆరోపించిన రేవంత్.. కాజీపేటకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తరలించుకుపోయారని తెలిపారు. భూములు ఆక్రమించుకున్న ఆరూరి రమేష్ అంగీ మార్చి, రంగు మార్చి వస్తుండు…భూములు ఆక్రమించుకునే ఆరూరి రమేష్ కావాలో.. పేదలకు వైద్యం అందించే కడియం కావ్య కావాలో తేల్చుకోండని పేర్కొన్నారు..