Telugu News » Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు రహస్యంగా అమెరికా బాలిస్టిక్ క్షిపణులు.. రష్యాపై దాడి..!

Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు రహస్యంగా అమెరికా బాలిస్టిక్ క్షిపణులు.. రష్యాపై దాడి..!

ఈదాడి బుధవారం అర్ధరాత్రి రష్యా(Russia) ఆర్మీ ఎయిర్‌ఫోర్స్, క్రమియాలోని మరికొన్ని ప్రాంతాలపై జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్షిపణులను పంపింది తామేనని యూఎస్‌కు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు.

by Mano
Russia-Ukraine War: America's Ballistic Missiles Secretly to Ukraine... Attack on Russia...!

ఉక్రెయిన్‌(Ukraine War)కు అమెరికా(USA) రహస్యంగా బాలిస్టిక్ క్షిపణులను పంపింది. తొలిసారి రష్యా ఆక్రమిత ప్రాంతాలపై ఉక్రెయిన్ వాటితో దాడి చేసింది. ఈదాడి బుధవారం అర్ధరాత్రి రష్యా(Russia) ఆర్మీ ఎయిర్‌ఫోర్స్, క్రమియాలోని మరికొన్ని ప్రాంతాలపై జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్షిపణులను పంపింది తామేనని యూఎస్‌కు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు.

Russia-Ukraine War: America's Ballistic Missiles Secretly to Ukraine... Attack on Russia...!

ఉక్రెయిన్ రష్యాలోని లిపెట్స్ ప్రాంతంలో ఉన్న పెద్ద ఉక్కు ఫ్యాక్టరీపై డ్రోన్ దాడి చేసి ధ్వంసం చేసిందన్నారు. ఈ యుద్ధంలో ఈ క్షిపణులను ఉపయోగించడం వల్ల ఉక్రెయిన్‌కు మరింత బలం చేకూరుతోంది. మరోసారి రష్యాతో పోటీపడే పరిస్థితి వస్తుందని యూఎస్ అభిప్రాయపడింది. అయితే, ఉక్రెయిన్ చాలా కాలంగా ఇలాంటి సుదూర ఆయుధాలను డిమాండ్ చేస్తోంది.

గతంలో ఉక్రెయిన్‌కు అమెరికా గరిష్టంగా 160 కిలో మీటర్ల పరిధి గల క్షిపణులను మాత్రమే ఇచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాలను అందిస్తోంది. ఈ క్షిపణులు రష్యాలోని జనాభా ఉన్న ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి. అదేవిధంగా నాటో(NATO) కూటమితో ప్రత్యక్ష సంఘర్షణను ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక, ఉక్రెయిన్ అందుకున్న కొత్త క్షిపణి పరిధి 300 కిలో మీటర్ల వరకు ఉంది. 2023 అక్టోబర్ నుంచి ఉక్రెయిన్లు అమెరికా ఈ క్షిపణులను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ 95 బిలియన్ డాలర్ల సహాయాన్ని ఆమోదించడంతో ఈ క్షిపణులను ఉక్రెయిన్‌కు అందిస్తోంది.

 

You may also like

Leave a Comment